దేశభక్తి ఎలా ఉంది!


Mon,May 7, 2018 01:06 AM

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ దార్శనికత.. దేశం, జాతీయత, దేశభక్తి, దేశమాత వంటి అనేక అంశాల్ని పునర్నిర్వచించింది. ఈనాడు ప్రపంచం కుగ్రామంగా మారి జీవనోపాధి అవకాశాల వేటలో ఎక్కడెక్కడికో పోతున్న మూలాల అన్వేషణ కూడా అంతే వేగంగా మారింది. అం టే పుట్టినూరు, దేశం, మమకారం మనిషి తత్వంలో ఒకభాగమన్నది నిర్వివాదాశం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2017 ఆగష్టు నాటికి 70 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో డాక్టర్ తూమాటి సంజీవరావు గారికి తెలుగు సాహిత్యంలో దేశభక్తి అనే అంశం మీద ఒక వ్యాస సంపుటి తీసుకురావాలనిపించడంతో ఆయన ఆ దిశగా తనకు తెలిసిన రచయితలు/రచయిత్రులకు సంక్షిప్త సందేశం ద్వారా వినతులు పంపారు. ఆ సం దేశాలకు ప్రతిస్పందించిన వందమంది వంద వ్యాసాలు పం పారు. అలా రూపుదిద్దుకున్నదే ఈ గ్రంథం. ఇందులో 16 అధ్యాయాలున్నాయి.
Deshabakti
అవి దేశభక్తి, దేశభక్తులు, జాతీయోద్య మ సాహిత్యం, రాష్ట్రోద్యమ సాహిత్యం, అమరజీవి సాహి త్యం, సాహితీస్రష్టలు, చారిత్రక కావ్యాలు, నాటకరంగం, సినీ సాహిత్యం, స్త్రీలు, కథానికలు,స్వీయచరిత్రలు, కవిత్వం, మైనార్టీవాదం, ప్రకీర్ణకాలు, అలాగే.. దేశభక్తిపై ఆంగ్లంలో నాలుగు వ్యాసాలున్నాయి. వ్యాసరచయితలందరూ లబ్దప్రతిష్ఠులే. వారు సీనియర్లే అయినా సమాచార సేకరణలో కొందరు ఎక్కడో ఎందు కో ఆగిపోయారనిస్తుంది. దేశభక్తి అంటే స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తర్వాత కొంతకాలంలో వచ్చిన సాహిత్యమే కావచ్చన్న అవగాహన కారణంగా కూడా కొన్ని అంశాల్ని వారు పరిగణనకు తీసుకోలేదు. ఉదాహరణకు నాటక సాహిత్యంలో ప్రకాశం పంతులుపై గొప్ప నాటకం వచ్చింది. కానీ ఇందులో దాని ప్రస్తావన లేదు. ఏ.జీ. ఆఫీసు తెలుగు సాహితీ సమితి రంజని ప్రచురించిన వ్యాసాల సంకలనం రజతరంజని సంపాదకమండలి చూసి ఉన్నా ఈ గ్రంథానికి లబ్ధి చేకూరి ఉండేది. ఎందుకంటే, అందులో జాతీయోద్యమం మొదలుకొని విప్లవోద్యమం, రూపపరిణామం వరకు గల ఉద్యమాలలో కవిత్వం, గేయం, కథ, నవ, విమర్శ ఎలా ప్రభావితమయ్యాయో స్థూలంగా రచయితలు విశ్లేషించారు. కనీసం యువభారతి ప్రచురించిన మహతి వంటి వాటిని చూసి ఉన్నా బాగుండేది.

ఏది ఏమైనా తెలుగు భాషా వికాస పరిషత్తు వారి కృషి శ్లాఘనీయం. ఎవరికీ పట్టని దేశభక్తిని భుజం మీద మోసిన సంజీవరావు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ గ్రంథం ప్రచురించారు. సమాచార లోపాలకు ఆయా రచయితలే బాధ్యులు కాని ఆయన కారు. రామాయణంలో లంకలోనే ఉండిపోదామన్న లక్ష్మణుడిని రాముడు వారించి జన్మభూమి ప్రాశస్త్యాన్ని ఎలా వివరించారో తమిళనాట ఉన్న సంపాదకులు తెలుగు సాహిత్యంలో దేశభక్తిని గ్రంథస్తం చేసి ప్రవాసాంధ్రులు పస ఉన్నవారని నిరూపించారు. ఇది ప్రతి ఇంటా ఉండవలసిన గ్రంథం అనడంలో సందేహం లేదు.
- ఆనంద్, 99120 90994

సంపాదకుడు: డాక్టర్
తూమాటి సంజీవరావు, 9884446208
వెల: రూ.500
ప్రచురణ: తెలుగు భాషా వికాస పరిషత్తు

650
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles