ఒక సారం కోసం..


Mon,May 7, 2018 01:05 AM

ప్రతి చారిత్రక విభాత సంధ్యల్లోనూ మన లో మనం సంభాషించుకోవాల్సిన సం దర్భం ఏర్పడుతూ ఉంటుంది. వర్తమానంలో కుదురుగా నిలబడి నడిచిన దారి గురించి మూల్యాంకనం చేసుకొని భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. గమ్యాలను, గమనాల నూ బేరీజు వేసుకొని ప్రస్థానం కొనసాగించాల్సి ఉం టుంది. మన బలాన్నే కాదు, బలహీనతలనూ తెలుసుకోవాలి. వాటిని అధిగమించే మార్గాలు అన్వేషించాలి. అందుకు బయటికే కాదు, లోపలికీ తరిచి చూసుకోవాలి.
Bhahula
ఈ నేపథ్యంలోంచే.. సాహిత్యాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకప్పుడు ఎంతో గతిశీలంగా ఉం డిన ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ స్తబ్ధతికి గురైందని అలవోకగా వ్యాఖ్యానిస్తున్నాం. సృజనాత్మక సాహిత్యం వచ్చినంతగా దాన్ని విశ్లేషించే విమర్శ రావటం లేదని పదేపదే బెంగపడుతున్నాం. అది పూర్తి గా నిజం కాదు. మరోవైపు సాహిత్య సృజన ఆశామాషీ వ్యవహారం కాని రోజులొచ్చాయి. ప్రలోభాలు, బుజ్జగింపులతో పాటు నిర్బంధాలు, నిషేధాలు వస్తున్నా యి. నాలుగు అక్షరాలు రాయాలన్నా నాలుగు గోడల మధ్యకు పోవటానికి సంసిద్ధత ఉండాల్సిన స్థితి ఒకటి ఏర్పడింది. దీంతో భద్ర జీవితాల్ని ఎంచుకున్న రచయితలు, కళాకారులు చెదిరిపోవటం మొదలైంది. కొందరు సుఖాల మత్తులో మునిగిపోయారు. మరికొందరు కాల్పానిక లోకానికి పరిమితమయ్యారు. ఇంకొందరు ప్రమాదరహితమైన కంఫర్టబుల్ జోన్‌లో నిలబడి యుద్ధాలు చేస్తున్నామంటూ గాల్లో కత్తులు తిప్పుతున్నారు. చాలామంది సోషల్ మీడియా దంతసౌధాల్లో వర్చ్యువల్ పోరాటాలు చేస్తూ తృప్తి పడుతున్నారు. నిబద్ధత, నిజాయితీ వంటి పదాలు అపహాస్యానికి గురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు నేల ఆధునిక సాహిత్య విమర్శ తీరుతెన్నుల గురిం చి, విమర్శలోని ఖాళీల గురించి, విమర్శకుల బలాబలాగురించి 25 మంది రచయితల మొహమాటం లేని అభిప్రాయాల కూర్పే ఈ బహుళ.
- ఏకే ప్రభాకర్,76800 55766
(రచయిత ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలోంచి
కొన్ని భాగాలు)


బహుళ

(సాహిత్య విమర్శ: సిద్ధాంతాలు-ప్రమేయాలు-పరికరాలు)
ఆవిష్కరణ సభ 2018 మే 12న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడలో జరుగుతుంది. ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన జరుగుసభలో జూపాక సుభద్ర, కృష్ణమోహన్, సూరేపల్లి సుజాత, యాకూబ్, ఏకే ప్రభాకర్ ప్రసంగిస్తారు. కె.శ్రీనివాస్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

- పర్‌స్పెక్టివ్స్
వెల: రూ. 290
ప్రతులకు: నవోదయ
బుక్ హౌస్, 040-24652387

460
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles