దున్న ఇద్దాసు పుస్తకావిష్కరణ సభ


Sun,April 29, 2018 10:34 PM

మాదిగ మహా యోగి దున్న ఇద్దాస్ రాసిన తత్వాలను తెలంగాణ వికాస సమితి పుస్తకంగా వేసింది. ఈ పుస్తకాన్ని మే ఐదవ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రధాన హాలులో ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత హాజరవుతారు.

దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ సాహి త్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ప్రముఖ వాగ్గేయకారులు గోరేటి వెంకన్న, రాష్ట్ర గంథ్రాలయ సంస్థ అధ్యక్షులు అయాచి తం శ్రీధర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు పుస్తక సంపాదకులు దున్న విశ్వనాథం పాల్గొంటారు. పి.భాస్కరయోగి పుస్తక పరిచ యం చేస్తారు. అందరికీ ఆహ్వానం.

- ఎర్రోజు శ్రీనివాస్,
తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

503
Tags

More News

VIRAL NEWS