జీవనయానం


Mon,April 23, 2018 01:35 AM

Jeevanayanam
బతుకుపోరు నవల 1982లో వెలువడింది. జీవనయానం దానికి రెండవ భాగం వంటిది. అయితే పాత్రలు, సంఘటనలు వేరు. ఉత్తర తెలంగాణ ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సామాజిక పరిణామాలకు సంబంధించి ఇది బతుకుపోరుకు కొనసాగింపు.
రచన: బి.ఎస్.రాములు, వెల: రూ. 120,
ప్రతులకు: విశాల సాహిత్య అకాడమీ, 201,
సులేఖ గోల్డెన్ టవర్స్, 2-2-186/53/5, ఆర్.కె.నగర్, బాగ్ అంబర్‌పేట్, హైదరాబాద్-13


అభాగ్యజీవనాల భాగ్యనగరం


abagya
(The Voice of slums)
హైదరాబాద్ నగరం దేశంలోని పెద్ద నగరాల్లో నాలుగవది. జనాభా కోటిన్నరకు చేరుకుంటున్నది. నగరం ఎంవేగంగా అభివృద్ధి చెందుతున్నదో అంతే వేగంగా స్లమ్స్ (మురికివాడ లు) పెరుగుతున్నాయి. నిజానికి స్లమ్ అనే ఇంగ్లీషు పదానికి మనుషులు నివసించటానికి ఏమాత్రం అనుకూలం కాని గృహాలు అని అర్థం. ఇలాంటి బస్తీల్లో ప్రజల జీవనగాథలు, కన్నీటి కథలు ఏమిటో ఈ పుస్తకంలో చూడొచ్చు.
రచన: కవిని ఆలూరి, వెల: రూ. 80, ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు

హింసకు అతీతంగా


Krishnamurthy
హింస అనే ఇతివృత్తానికి జె.కృష్ణమూర్తి సమీక్షించిన తీరు 1970లో అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నది. నాటి పరిస్థితులకు ఆ చర్చ అవసరమ ని భావించారు. ఆ అవసరం నేటికీ అలానే ఉన్నదని మనందరికీ తెలుస్తున్నది.
రచన: జె.కృష్ణమూర్తి, తెలుగు: ఆచార్య ఎన్. భాస్కరరెడ్డి,
వెల: రూ. 130, ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

598
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles