తెలంగాణ పద్యకవితా వైభవం


Mon,April 16, 2018 12:40 AM

padyakavitham
తెలంగాణలో ఛందోబద్ధమైన కవిత్వం మొదటినుంచీ వెలువడింది. ఛందస్సుకు లయ ప్రధానం. పనిపాటలు అనే నానుడి ఉంది. పనిచేసేటప్పుడు పాడుకుంటారు. ఆ పాటలకు ఆ పనికి అనుకూలమైన లయ ఏర్పడుతుంది. ఆలయ అనుకోకుం డా ఒక నియమంగా సాగుతుంది. తెలంగాణ భాష, సంస్కృతి పూర్తిగా తనదైన పద్ధతిలోనే సాగిందని తెలుస్తున్నది. ఆ దృష్టితో ఇవాళ తెలంగాణ పద్యకవిత్వాన్ని సాహిత్యాన్ని చదువుకోవాలి.
రచన: డాక్టర్ గండ్ర లక్ష్మణరావు,
వెల: రూ. 50, ప్రతులకు:తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభారతి,
రవీంధ్రభారతి ప్రాంగణము,
హైదరాబాద్-04


తెలంగాణ తేజోమూర్తులు

TSTejoo
1969 తెలంగాణ ఉద్యమం, 72 ప్రత్యేక ఆంధ్రా ఉద్యమంతో రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఇల్లిం దల సరస్వతీదేవి ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకం రాసేనాటికి ఇందులోని చాలా మంది సజీవులే. ఆంధ్రలో పుట్టి తెలంగా ణలో మెట్టిన సరస్వతీదేవి రెండు ప్రాం తాల మధ్య వంతెనలాంటివారు. తెలుగు నేలలోని పది మంది తేజోమూర్తుల జీవిత విశేషాలే ఈ పుస్తకం.
రచన:ఇల్లిందల సరస్వతీదేవి,
వెల: రూ. 70 ప్రతులకు:నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ, జీఎస్‌ఐ పోస్ట్, హైదరాబాద్-68. ఫోన్:24224453


ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం

Sridharkavitham
తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలు పురుడు పోసుకుని ఉద్యమ రూపం దాల్చి పరవళ్లు తొక్కినప్పుడల్లా ఉద్యమ కవితం అదే స్థాయిలో పుట్టుకువచ్చింది. సాగుతు న్న ఉద్యమానికి ఊపిరిగా మారింది. ఉద్య మిస్తున్న ప్రజలకు దన్నుగా నిలిచి అడుగు లు తడబడినప్పుడల్లా దారిచూపింది. వెలుగుదారి వేసింది. అలాంటి ఉద్యమ సాహిత్యం తెలంగాణ ఉద్యమంలో రాసి లో, వాసిలో ఎలా ఉన్నదో తెలిపేదే ఈ పుస్తకం.
రచన:డాక్టర్ వెల్దండి శ్రీధర్
వెల: రూ. 60, ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభారతి, రవీంధ్రభారతి ప్రాంగణము,
హైదరాబాద్-04.

605
Tags

More News

VIRAL NEWS