తొణకని వాక్యం ఆవిష్కరణ సభ


Mon,April 16, 2018 12:37 AM

కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవితా సంపుటి తొణకని వాక్యం ఆవిష్కరణ సభ 2018 ఏప్రిల్22న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్, మెట్టుగడ్డ లిటిల్ స్కాలర్ హైస్కూ ల్ ఆవరణలో జరుగుతుంది. వి. మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా ఆచార్య ఎన్.గోపి, జలజం సత్యనారాయణ, డాక్టర్ సీతారాం, డాక్టర్ ఎస్. రఘు, బుర్రి వెంకటరామిరెడ్డి, కె. లక్ష్మణ్‌గౌడ్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, తదితరులు హాజరవుతారు.
- ధ్వని ప్రచురణలు, మహబూబ్‌నగర్

కథా సంపుటాలకు ఆహ్వానం

సహృదయ సాహితీ పురస్కారం-2017 కోసం గాను 2013-17 మధ్య కాలంలో ముద్రించిన కథా సంపుటాలను మూడు ప్రతులను 2018 జూన్‌లోగా పంపించాలని కోరుతున్నాం. చిరునామా: కుందావజ్జల కృష్ణమూర్తి, ప్లాట్ నెం:207, ఇంటి నెం:2-7-580, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హన్మకొండ-506001. సెల్:9849366652
- డాక్టర్ ఎంవి రంగారావు, సహృదయ అధ్యక్షులు, డాక్టర్ ఎన్.వి.ఎన్. చారి, ప్రధాన కార్యదర్శి

కవిరాజ్ స్వర్ణోత్సవ కవి సమ్మేళనం

కవిరాజ్ స్వర్ణోత్సవం సందర్భంగా కవిసమ్మేళనం 2018 ఏప్రిల్ 21న సాయంత్రం 5 గంటలకు సూర్యాపేటలోని సాయిబృందావన్ ఫంక్షన్ హాలులో జరుగుతుంది. పెద్దిరెడ్డి గణేష్ అధ్యక్షతన జరుగు సభలో ముఖ్యఅతిథులుగా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ప్రత్యేక అతిథిగా వేణు ఊడుగుల, మీలా సత్యనారాయణ తదితరులు హాజరవుతారు. వేణుసంకోజు, దేవులపల్లి కృష్ణమూర్తి, కోయి కోటేశ్వరరావు కవిసమ్మేళనం నిర్వహిస్తారు. పురస్కారగ్రహిత జూలూరు గౌరీశంకర్.
- కవిరాజ్ మిత్రులు

నివురు ఆవిష్కరణ సభ

2018 ఏప్రిల్ 18న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిజం రాసిన కవిత్వ సంకలనం నివురు ఆవిష్కరణ సభ జరుగనున్నది. ఈ సభలో పి.అంజయ్య, కె.శివారెడ్డి , కె.శ్రీనివాస్, దేవిప్రియ, ఎన్.వేణుగోపాల్ తదితరులు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.
- నిజం

558
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles