నీల (నవల)


Mon,April 9, 2018 01:30 AM

book
తన అస్తిత్వాన్ని కాపాడుకోవటంలో జీవితం లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, తానెంచుకున్న గమ్యా న్ని చేరిన సాహస యువతి నీల కథ ఇది. బలీయమైన ప్రేమ, స్వేచ్ఛకు సంకెలగా పరిణమించిన సంఘర్షణాత్మక సందర్భాల్లో క్లేశాన్ని అధిగమిస్తూ, చిక్కుముడులు విప్పుకుంటూ ఆ రెంటి మధ్య సమన్వయం సాధించిన స్త్రీ జీవిత శకలం కె.ఎన్. మళ్లీశ్వరి నవల నీలి.
రచన: కె.ఎన్. మల్లీశ్వరి, వెల: రూ. 250
ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ నవచేతన అన్ని పుస్తక కేంద్రాలు

book1

ఒంటరి

మాయమవుతున్న పల్లె జీవితంపై పట్టణ ప్రభావం నేపథ్యంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఇది. జంతువుల అరుపుల్ని వాటి భాషగా అర్థం చేసుకోలేక, మొక్కల స్పర్శను వాటి పలుకులుగా అనువదించుకోలేక, పక్షులతో చెలిమి చేయలేక వాటిని దూరంగా తరిమి వాటి నేలను సొంతం చేసుకోవాలనే మనిషి అమానవీయతను, మూర్ఖత్వాన్ని విప్పి చెప్పే నవల ఒంటరి.
రచన: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి వెల: రూ. 125
ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ, నవచేతన అన్ని పుస్తక కేంద్రాలు

scan

యుద్ధం నాకు ఆయుధాన్ని బాకీపడింది

నీ కన్నులు నవ్వుతాయని చెప్పనేలేదు, రోదించే హృదయాన్ని ఎలా ఊరడించను.. అంటూ నజీర్ దుఃఖా న్ని ఓదార్పును కవి త్వం చేశాడు. ఆయన నిజనిర్ధారణకు వెళ్లి బందీ అయినప్పుడు నిర్బంధం ఆయనలోని కవిని తట్టిలేపింది. చీకటి కొట్టులోంచి కొత్తచూపును తీసుకొని వచ్చాడు. సున్నితమైన ఊహాశక్తిని వెంటేసుకొని వచ్చిన ఆయన హృదయస్పందనలే ఈ కవిత్వం.
రచన: నజీర్, వెల: రూ. 20
ప్రతులకు: నజీర్, రూమ్‌నెం:232 న్యూగోదావరి హాస్టల్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్-07. సెల్:9849573546
old-book

ఆధునిక విజ్ఞానశాస్త్రం తాత్విక అంతరార్థాలు

విజ్ఞానశాస్త్రంలో ఇంకా స్పష్టతలేని అంశాలను ఆసరాగా తీసుకుని, విజ్ఞానశాస్త్రంలోని అంశాలకు తమ స్వంత వ్యాఖ్యానాలు జోడించి వక్రీకరించే వెకిలి విజ్ఞానశాస్త్రం ప్రచారం చేసే వాళ్ల నుంచి శాస్త్రవిజ్ఞానాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది. క్వాంటం మెకానిక్స్‌లోని డబుల్‌స్లిట్ ప్రయోగాన్ని నానారకాలుగా వ్యాఖ్యానించి జగమేమాయ అని ప్రచారం చేసే వాళ్లు ఉన్నారు. ఇలాంటి కుతర్కాలకు సమాధానమే ఈ పుస్తకం.
రచన: ఆనందేశి నాగరాజు ,వెల: రూ. 70
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్ అన్ని పుస్తకకేంద్రాలు

827
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles