చారిత్రక రైతు మహోద్యమం


Mon,April 2, 2018 01:24 AM

Charitha

(చంపారన్ సత్యాగ్రహం)

ఇది చంపారన్ సత్యాగ్రహ శత వార్షికోత్సవ సంవత్సరం. మహత్తర రష్యన్ విప్లవం కంటే ముందే చంపారన్ ఉద్య మం జరిగింది. ఆ ఉద్యమాన్ని నడిపించినవాడు గాంధీ. 70 ఏండ్ల స్వాతం త్య్ర భారతదేశంలో వ్యవసాయ, ఖాదీ, చేనేత గ్రామీణోత్పత్తి రంగాలన్నీ పాలక విధానాల పుణ్యమాని కుంటుపడ్డాయి. ప్రకృతి సహజమైన ఉత్పత్తులు చులకనగా చూడబడుతుంటే, భూగోళాన్ని నాశనంచేసే పారిశ్రామికోత్పత్తు లు ప్రభుత్వాల చేత ప్రజలపై రుద్దబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంపారన్ ఉద్యమస్ఫూర్తి నేటి అవసరం.
సంపాదకుడు: రావెల సోమయ్య, వెల: రూ.100
ప్రతులకు: లోహియా విజ్ఞాన సమితి, 101, గోధా నిలయం
మయూరి మార్గ్, హైదరాబాద్-16. సెల్:90320 94492


గోలకొండ పత్రిక

Golakonda

(అనువాద కథలు-3)

ఈ మూడో సంకలనంలో ఎంపిక చేసిన 26 అనువాద కథలున్నాయి. ఆయా భాష ల్లో సుప్రసిద్ధులైన ప్రేమ్‌చం ద్, గౌరీశంకర్ జోషి, సజ్జాద్ హైదర్, సుదర్శన్ సోలసింగా ర్, మనోహర్‌లాల్ బజాజ్ లాంటి వారి కథలు ఇందులో ఉన్నాయి. భారతీయ జీవన సంస్కృతులకు మచ్చుతునకలే ఈ కథలు.
సేకరణ, కూర్పు: యామిజాల ఆనంద్,
డాక్టర్ వి.వి. వేంకటరమణ, వెల: రూ.140
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ (నాగోల్), జీఎస్‌ఐ పోస్ట్
హైదరాబాద్-68, ఫోన్: 24224453


అష్ఫాఖ్-బిస్మిల్‌ల అద్భుత అమరగాథ

Ashak
రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖు ల్లా ఖాన్ ఇద్దరు వీరులు. 90 ఏం డ్ల కిందట దేశంకోసం చిరునవ్వు తో ప్రాణాలర్పించారు. ఒకరు గీత నీ, మరొకరు ఖురాన్‌నీ పఠిస్తూ ధీరులుగా ఉరికంబానికి నడిచా రు. హిందూ ముస్లిం ఐక్యతను స్థాపించండి, ఇదే మా చివరి కోరి క, మా స్మృతి చిహ్నం కూడా ఇదే కాగలదని అంతిమ సందేశం ఇచ్చారు. అష్ఫాఖ్, బిస్మిల్‌ల చివరి ఆకాంక్షను మనం నెరవేర్చగలమా?
రచన: విజయవిహారం రమణమూర్తి, వెల:రూ.350
ప్రతులకు: జై భారత్ పబ్లికేషన్స్, 3-8-347
మన్సూరాబాద్, చంద్రపురి కాలనీ, ఎల్‌బీ నగర్
హైదరాబాద్-74, ఫోన్:9848019076


కలత నిద్దురలో

kalatha

(క్రాంతి కవిత్వం)

రచయిత క్రాంతి సున్నిత కలలు దగ్ధమవుతుంటే వాటిని కవిత్వంలోకి ఒంపుతున్నాడు. ఈ కవి త్వం బూడిదలో నుంచి లేసే ఫీని క్షు పక్షి. కన్నీళ్లు రాలిన ప్రతిసారి అవి అక్షరా లై ఓదార్చే కవిత్వాన్ని అతడు అల్లాడు. వసంత గానాలు వినిపించాడు. దానితోపా టు దారి పొడుగునా పుప్పొడి చల్లుకుంటూ వస్తున్నాడు.
రచన: క్రాంతి వెల: రూ.30
ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు

724
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles