కవితా సంపుటాలకు ఆహ్వానం


Mon,April 2, 2018 01:20 AM

పాలమూరు సాహితీ అవార్డు కోసం రచయితలు 2017లో ముద్రితమైన తమ కవితా సంపుటాలు మూడింటిని ఏప్రిల్ 30వ తేదీలోపు పంపించాలని మనవి.
చిరునామా డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇంటి నెం: 8-5-38
టీచర్స్ కాలనీ, మహబూబ్‌నగర్-509001.
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 90328 44017


నిక్వణ ఆవిష్కరణ సభ

భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో దేవనపల్లి వీణావాణి కవిత్వం నిక్వణ ఆవిష్కరణ సభ 2018 ఏప్రిల్ 8న సాయంత్రం 6 గంటలకు,హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌హాల్‌లో జరుగుతుంది. వఝల శివకుమార్ అధ్యక్షతన జరుగు ఈ సభలో గౌరవ అతిథులుగా దేశపతి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, కె.విమల, ఎస్. హరగోపాల్ హాజరవుతారు. పుస్తకావిష్కర్తగా డాక్టర్ నందిని సిధారెడ్డి హాజరవుతారు. డాక్టర్ కాంచనపల్లి, చెమన్‌ల ఆప్తవాక్యాలు ఉంటాయి.
- ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్,తెలంగాణ సాహిత్య సమాఖ్య, కన్వీనర్

బహుజన కవిగాయక సమ్మేళనం

బహుజన కవిగాయక సమ్మేళనంలో భాగంగా రాష్ట్ర సదస్సును 2018, ఏప్రిల్ 8న, మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డిలోని గాంధీ సెంటినరీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నాం. మాతంగి చిరంజీవి అధ్యక్షతన జరుగు ఈ సభలో అతిథులుగా కవులు యం.అనంత య్య, సి.హెచ్.రాములు, ఎన్నార్, మల్లయ్య, చిట్యాల దేవయ్య, విశాల్, రాంచందర్ భీం వంశీ, సొన్నాయిల బాల్‌రాజ్, మద్దికుంట తుల్జయ్య, అయిదాల సునీల్, బీబీపేట రాజు తదితరులు పాల్గొంటారు. డప్పోల్ల రమేశ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. బహుజన సాహి త్య దృక్పథంపై డాక్టర్ పసునూరి రవీందర్,కవిత్వ నిర్మాణ పద్ధతులపై మెర్సీ మార్గరెట్ ప్రసంగిస్తారు.
- బహుజనం సాంస్కృతిక వేదిక, తెలంగాణ

520
Tags

More News

VIRAL NEWS