ప్రపంచ కవితా దినోత్సవం


Sun,March 18, 2018 10:56 PM

కవిసంధ్య, డాక్టర్ ఎస్.ఆర్.కె. ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 21న ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఆధునిక కవిత్వంపై జాతీయ సదస్సు, కావ్య సంపుటాల ఆవిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో మల్లాడి కృష్ణారావు, జయరాజ్ డానియల్, వాడ్రేవు సుందర్రావు, ఖాదర్ మొహియుద్ధీన్, జి.లక్ష్మీనరసయ్య, రామతీర్థ, ప్రసాదమూర్తి, యాకూబ్, మువ్వా శ్రీనివాసరావు, మధునాపంతుల, దాట్ల దేవదానం రాజు, వాడ్రేవు వీరలక్ష్మి తదితరులు పాల్గొంటారు.
-తెలుగుశాఖ, డాక్టర్ ఎస్.ఆర్.కె. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల
- కవి సంధ్య, యానాం

తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్-2018

2018 ఏప్రిల్ 28,29,30 తేదీల్లో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో జరుగు తెలంగాణ లిటరరీ ఫెస్ట్ -2018 సదస్సు తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. ఈ సందర్భంగా పరిశోధనా వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం.అంశాలు- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో వచ్చిన సాహిత్యం, ప్రపంచీకరణ కవిత్వంలో తెలంగాణ ప్రాదేశికత, తెలంగాణ ఉద్యమ కవిత్వం-తొలి మలిదశలు, సామాజిక మాధ్యమాలు-కవిత్వ ప్రమాణాలు, తెలంగాణ కవిత్వం-తెలంగాణ భాషానుశీలన. వ్యాసాలు ఐదు పేజీల నిడివితో అనుఫాంట్-7.0 వర్షన్‌లో ఓపెన్, పీడీఎఫ్ ఫైల్స్ ఏప్రిల్ 10లోపు పంపాలి. వ్యాసానికి 300 రూపాయలు చెల్లించాలి. చిరునామా: mk.ananthoju@gmail.com. రుసుమును-SATAE BANK OF INDIA, A/C No. 20137804269 , IFS Code: SBIN000916
-తెలంగాణ సాహితి

మూడుతరాల కవిసంగమం-37

కవిసంగమం ఆధ్వర్యంలో 2018 మార్చి25న, సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్,బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వతపరిషత్తులో మూడుతరాల కవిసంగమం సభ జరుగుతుంది. ఇందులో అల్లం నారాయణ, దయాకర్ వడ్లకొండ, పల్లిపట్టు, రమాదేవి బాలబోయిన, కృష్ణ గుగులోత్ హాజరవుతారు. అందరికీ ఆహ్వానం.
-కవి సంగమం

తెలంగాణ వచన కవితా వికాసం

తెలంగాణ సాహిత్య అకాడమీ, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, సుబేదారి హనుమకొండ ఆధ్వర్యంలో 2018 మార్చి 22, 23 తేదీల్లో తెలంగాణ వచన కవితా వికాసంపై జాతీయ సదస్సు జరుగుతుంది. ప్రొఫెసర్ బన్న అయిలయ్య ఆధ్వర్యంలో జరుగు ఈ సదస్సులో డాక్టర్ నందిని సిధా రెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, రామాచంద్రమౌళి, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య కాత్యాయనీ విద్మహే, ప్రొఫెసర్ బూదాటి వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ మాడభూషి సంపత్‌కుమార్, ఆర్. సీతారాం, డాక్టర్ బెల్లి యాదయ్య, ఆచార్య గుండెడప్పు కనకయ్య, డాక్టర్ జి. బాల శ్రీనివాసమూర్తి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ లావణ్య, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, పగడాల నాగేందర్, షాజహానా తదితరులు హాజరవుతారు.
-ప్రొఫెసర్ బన్న అయిలయ్య, 9949106968, -డాక్టర్ పెద్ది వెంకటయ్య, 8919138273

742
Tags

More News

VIRAL NEWS