ఒకే తోవ


Mon,November 18, 2019 01:05 AM

RIVER
ఆగి ఆగి వేసే గాలి
ఊగి ఊగి కొమ్మలాడె
రాలి రాలి పుప్పొడి రాలి
గాలిలోన గంధమూరె
వాలి వాలి తమ్మెదలాలీ
వాలుగొమ్మ తేనెలూరె
రాలుతున్న పూలవాన వీణ
రాగమేదో మోగె సందెవేల
నింగి నీలి రంగు వెలిసే వేల
నీడలేమొ కురులు పరిసే వేల
చూడ రంగులన్ని ఒకటే నంట
మేడయిన గూడయిన
నేలమీద నంట
ఉండేందుకు
తావె నంట
పరుపైన సాపయిన
మురిపెమెందుకంట
నిండయిన
నిదురె మేలంట
కమ్మని విందయిన
కారం మెతుకయిన
రుచిలోనె తేడనంట
ఆకలి ఒకటెనంట
వాగయిన ఏరయిన
పరుగు భేదమంట
పారేది నీరేనంట
సంద్రానికి తోవేనంట
- గోరటి వెంకన్న

113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles