నెలవంక


Mon,November 11, 2019 01:32 AM

NELAVANKA
పూవు రాలిపోయింది
అందాక కొమ్మకు
శోభాయమానంగా
పరిమళభరితంగా వున్న
పూవురాలిపోయింది!
గాలివీచి రాలిందో
చినుకులుపడి రాలిందో
కొమ్మ విరిగి రాలిందో కానీ..
దారిపక్క చెట్టుకొసన
చందమామలా నవ్వేది
ఎటు నుండి చూసినా
చుక్కలా చటుక్కున
చూసేది..!
ఆ పువ్వొక మధుర గీతం
పాడుతున్నంతసేపు
నెమలి పింఛం విప్పి
నాట్యమాడేది!
ఆ పువ్వొక అద్భుతదీపం!
వెలుగుతున్నంతసేపు
జలపాతమై దూకుతూ
కనపడేది..!
రాలిన పువ్వును అతికించటమెట్లా?
చినుకులుపడి లెమ్మన్నా
గాలివీచి రమ్మన్నా
కొమ్మ విరిగి
మోకరిల్లినా
అందదు అతకదు
కానీ..
పువ్వుతో పాటు
విత్తనమూ రాలింది..
చావు కారణం పుట్టుకన్నట్టు
అమావాస్య తర్వాత
నెలవంక ఎంతసేపైనా
నిరీక్షణ తప్పదు గాక తప్పదు
మొక్క మొలిచేదాకా..!
పువ్వు వికసించేదాకా..!!
- కందుకూరిశ్రీరాములు
9440119245

124
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles