మోదుగుపూల వర్ణరాగం


Mon,November 11, 2019 01:31 AM

Modugachettu
కనులు తెరిచి స్వప్నించిన
రెప్పల గానానివి
నిశ్శబ్దంగా వేసుకుంటూ
వెళ్ళిన అడుగుల వెనుక
ఎన్ని మోదుగుపూల
వర్ణరాగాన్ని వెదజల్లినవో..!
నువ్వు ఆకుపచ్చని
ఆకాశంలోకి ఎగరేసిన
అక్షర నక్షత్రాలు..
అరుణ గీతాలవుతున్నయి!
ప్రశ్నలు నినాదపు గొంతుకలుగా
వెలుగుతున్నయి!
అనామిక చరణాలు
కొన్ని నీ పాదాలు తాకి
నీ గుండె పల్లవిని విన్న ప్రవాహంలో
తడి రాగాన్నందుకున్నయి..!
ఇప్పుడు..
చుట్టూ పరుచుకున్న
స్వేచ్ఛలేని పాకుడు
విప్పారిన నెమలికన్నుకు
దిగులుమొగులై కమ్ముకున్నది!
నీపాదముద్రలు సోకని థింసాలో
చెక్కపూసలు లయతప్పినయి
పరుచుకున్న ఇప్పపూలు
వెలవెలగా బుగులుపడ్డయి
నది తన దోసిలితో
చేపపిల్లలను ఓదారుస్తుంది
నిర్బంధం..
శిథిల శరీరానికా
సిద్ధాంతపు తలపులకా
పోరుబాటలకా...
- సీహెచ్ ఉషారాణి,94412 28142

98
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles