నది


Mon,October 7, 2019 12:14 AM

నది...
జల ప్రవాహ హోరు వినిపిస్తున్నది
పరుగులాటలతో నది
నా వైపు చూస్తున్నది!
బతుకు తొలినాళ్ల నుంచీ
నదే నా జీవనధార
అదే నాకు స్నేహధార..
స్నేహహస్తం సాచినట్లనిపించే
ఆ నది ఘోష పిలుపే
నన్ను నిత్య సంఘర్షణశీలిని చేసింది
ఆ నదీ ప్రవాహదారులే
వెలుగుదారులు చూపాయి
ఇసుక తిన్నెలు ఆటలు నేర్పాయి
అక్కడ ఆడుకున్న ఇసుక పిట్టగూళ్లు
నేను కట్టుకున్న ఆశల సౌధాలకు ఆదర్శాలు
ఆ ఇసుక తిన్నెల్లో దోబూచులాడుకున్న
మా స్నేహాలే
నదీ ప్రవాహంలో సమకూర్చుకున్న
గులకరాళ్ల సోయగాలు
నేటి కలల సరాగాలు
నేనిప్పుడు ఆ నదిని
నాలో విలీనం చేసుకున్నా
పొంగే కవిత్వంలా..
అలుపెరుగని పోరాటంలా..
- డాక్టర్‌ భూపతి రమేష్‌
94404 44949

82
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles