జలాజంత్రం


Mon,September 30, 2019 12:41 AM

పెద్దగద్ద మట్టిల దుంకులాడితె
ఇయ్యరమయ్యర జంపిన
బుడ్డపోరి పేస్టు జప్పరిస్తే
చెవులు రెండూ వొడేశిన
నాకు రిమోట్‌, అదే పనిగా
ఉచిత సలహాలిస్తే
క్రియాశూన్యం జేసి అప్పుడప్పుడు
జుట్టుకు ముడేసి తిప్పిన
అమ్మ తరతరాల సోదివెడ్తే
గద్దిచ్చి నోర్మూపిచ్చిన
నువ్వొక్కతివే దొర్కుతలేవు
నువ్వు లేకుంటే నేను బేజారని నీకెర్కే
నువ్వేమో వానమబ్బుల దాక్కుంటివి
నువ్వు నా ముద్దుల బుచ్చివి
సంపెంగ నవ్వువి
పరవశానికే నయగారానివి
కలకూ మెలకువకూ నడుమ వారధివి
బంగారు కొండవి
నువ్వు నా జీతం లేని అంబాసిడర్‌వి
ఉంటే ఉన్నవ్‌ గని
దాని జాడే లేకుంట వోయింది
ఎల్లెం పట్కరా...
ఉయ్‌...య్య....
సదిరియ్యని గుడిసెలల్ల పొట్కు
పగిలిన పెంకలల్ల ధార
నీళ్ళుట్టుతున్నశెత్తులు
బండలింటిమీద గడ్డి
జెర్రిపోతుల ఎంకన్న సాయమాను
జలాజంత్రమయ్యింది
గిట్ల వానొస్తె చాలు
దానెంటనే... నా లేత కళ్ళ బుజ్జి
తడి ఒంటి లచ్చి
- ఏనుగు నరసింహారెడ్డి, 89788 69183

70
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles