స్వప్న ఫలం


Mon,August 26, 2019 12:51 AM

ఒకటే కల
జీవితం నిండా
ముగించని, మాయం చేయలేని
పుట్టుకతో..
ప్రసారానికి అంతూ పొంతూ వుండదు
ఊరింపుల వూరేగింపుల బొమ్మ
అదే పదే పదే
ఏక నామమై, ఒకే నినాదమై,
రద్దు మత్తు జల్లి, సంపూర్ణ దేశభక్తితో
వాయువేగాల విహారానందం
ఊహ పూసినా, నువ్వు విరబూసినా
జీఎస్‌టీ పెనంపై చేప లెక్కనే
నీ పూజా సామాగ్రి సిద్ధపరచబడ్డది
నీ ఇష్టారాజ్యాలు సెన్సార్‌ చేయబడ్డవి
శాసనాలైనా ఆసనాలైనా
శిరోధార్యాలే
ఆకాశమందుకునే ఉక్కు విగ్రహం ముందు
బల్వాన్‌ పహిల్వాన్‌ అన్న చరిత్రకే మొక్కాలి
కంటి మాగ్నెట్‌కి చిక్కే దేశాలేవో
చూపుకి టార్గెట్‌ అయ్యే దేశాలేవో
అయోధ్య రాముడు రాసిపెడ్తడు
కుటుంబం లేదు
‘హిందూత్వ’మే కుటుంబం
మనసులోని మాటలన్నీ
నామావళిగా జపించాలి
గంగాజల ప్రోక్షణతో పాపాలన్నీ ప్రక్షాళనే
త్రికాల నామస్మరణకు మూడు నామాల
మంత్రోపదేశమే శరణ్యం
ఇన్ని రంగులెందుకు
ఇసీ, ఈ రుచులేమిటి
స్వచ్ఛభారత్‌లో ఇంత స్వేచ్ఛ యేల?
ఏక్‌ రంగ్‌కి జెండా ఊంచా రహేగా సదా
హమ్‌ సబ్‌ ఏక్‌ దేశ్‌హై
హమేశా ఏక్‌ హి నేతా
తిరగ రాసిన అక్షరం చెరలోనికే
అత్తరొంపే నెలవంక సరిహద్దు సమాధి లోనికే
ఎన్ని కలలు కన్నా రద్దు పద్దులోనికే
ఒకటే ఒకటే కల కను
నిద్రపట్టని రోజున
ఒకేఒకే పీడకల కను...
- దాసరాజు రామారావు
96182 24503

74
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles