ఒక స్వప్నం తర్వాత


Mon,June 24, 2019 01:11 AM

odhiraju-praveen-kumar
దోబూచులాడిన దొంగాటకు ఇక తెర పడినట్లే
ఈరోజు నా నేల మీద పారాడిన గోదారి
ఇక తెలంగాణ దారుల వెంట పచ్చని గాలై కమ్ముకుంటుంది
ఎండిన నేలను, ఎగిరే దుమ్మును
తన తడి స్పర్శతో తైల్లె హత్తుకుంటుంది
పంటల మీద పక్షుల మోత
పిల్ల బాటన కైకిలి కూత
బండి గిర్రలు, నాగలి కర్రులు
ఎద్దుల గిట్టలు, పెద్దగుమ్ములు
ఇప్పుడు మళ్ళీ మొలకెత్తే పాత గుర్తులు
తెలంగాణ కొప్పులో కాళేశ్వరం
నీటికి నడక నేర్పిన మహోజ్వల ఘట్టం
ఎండిన స్తన్యం
ఎండమావులు ఇక చరిత్రే
ఇక నేల నేలంత నీటి ఊట
నేటి కొత్త నీటితో రేపటి బోనం తలంటుకుంటది
తంగేడు పూవు తనువారా ఆటాడుకుంటది
వాడ వాడంత డప్పుల దరువు
కాళ్ళ గజ్జెలకు కొత్త నెలవు
నీరు ఎత్తు నెరుగు
తెలంగాణ పంటై వెలుగు
- ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
98490 82693

139
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles