తొక్కులాట..


Mon,May 20, 2019 02:05 AM

former
ఎన్నాళ్లకో.. నిన్నమా వూరికి పొయ్యొచ్చినచిన్నప్పుడు పైటెండ వానల తనివిని నిలువెల్ల తడుపుకున్న
నగ్నత్వపు జాడల మట్టి వాసన..కసి గట్టిన నికృష్టపు మతుల మధ్యఇమడలేని శరం గాయపడ్డదో..
వసివాడని మా పసితనాన్నిగారవించలేని ధైన్యం కలతపడ్డదో..రెక్కలొచ్చీ రాని పిల్ల పక్షుల్నితల్లిపక్షి వొదిలేసినట్టుఅమ్మ ఎడబాసింది..అమ్మే మమ్మల్ని పోగొట్టుకున్నదోమేమే అమ్మని పోగొట్టుకున్నమో
మతిల పడ్డప్పుడల్లా ఏదో శూన్యావహన..బీల్లల్ల రేగిపండ్లేరుకుంటున్నప్పుడోమెదలొదిలేసిన పరిగేరుకుంటున్నప్పుడోకాడిగెట్టుకవతలపసుల కాసుకుంట గట్టుమీద కూసోనికృష్ణుడూ.. ఇటు రారా అంటూ
రేక కట్టించినెత్తి నిమురుకుంటకడుపార కల్లుతాపినపెద్దమ్మ జ్ఞాపకాలే తారాడినైపెదనాయన శవం కాడ నా కండ్లు వర్షించిన వేదనల..నాడు అమ్మ పోయినప్పుడుఊరు వాడ ఇంటిల్లిపాది..గొల్లుమంటుంటె
ఏమయ్యిందో అంతు చిక్కకఅన్ని మొహాల్నీ ప్రశ్నార్థకంగ చూస్తూబిక్కమొగమేసుకున్న నా పసితనం..బతుకును బహిష్కరించినట్టునులక మంచానికి అతుక్కుపోయినిన్నమొన్నటి దాకాఆరేడు శీతరుతువులుపెదనాయిన తనమూగ వేదనలో బతికించుకున్ననాటి పెద్దమ్మ చావులోఎరుక తెలియనినాడు పోగొట్టుకున్నఅమ్మకోసం ఏడ్చిన..పెదనాయిన చావుఒక నెపం మాత్రమే..మనసు మనసుల లేదు
కాలు నిలువలేదుఏదో పోగొట్టుకున్న దేవులాటఊరు ఊరంత కలియ తిరిగిన..పసినతం తొంబర్లాడిన
మల్లబడ్డ మురికినీళ్ల గుంతల్నిసిమెంటు రోడ్లు మింగేసినై..ఎన్నెలకుప్పలోదాగుడుమూతలోఎదురుబదురుగా కూసున్నవొడవని ముచ్చట్లోసావాసగాళ్లందరికినడిజాముదాక ఆవాసమైనదొరోల్ల ఉప్పరిల్లిన పెరటిగోడల పునాదులల్లశ్లాబుల భవంతులు మొలిచినై..

ఆరుగాలం చెమటోడ్చినాదోసెడిత్తులు చేతికి రాక ఏడాదికెకరం లెక్కనఅప్పులకు కట్టుకుంటొచ్చిన
మా తాకట్టు సెలకనిమళ్లొక్కసారికండ్ల జూసుకుందమనుకున్న కానీకాలాడలేదుధైర్యమాసలేదు..నా ఊరికి నేనునేను నా ఊరికిపరాయిలమైపోయిన దుఃఖం..బుసకొట్టి కోడెలోతిగరొమ్ములు విరుచుకుంటపందెం గుండ్లెత్తి బలిగుడులాడినకక్కయ్యలకు ఎదురుపడిఅగాధాల్లోనికెక్కడికోఅదృశ్యమైపోతున్నట్లున్న వాళ్లకండ్లల్లకు తేరిపారి చూస్తుంటేఒక మృత్యుహేల భయానక దృశ్యాలు..అంతిమయాత్రకు పైనమైతున్నతొమ్మిది పదుల పెదనాయిన
ఆఖరి చూపుల తొణికిసలాడినజీవకళ జీరకక్కయ్యల మొహాలల్ల తాండవిస్తున్నఆరుపదుల చావుకళని
వెక్కిరిస్తున్నట్లనిపించింది..నేలను పొడుచుకుంట నడుస్తున్నచేతికర్రలుపాడెలు కట్టడానికోకాష్ఠాలు తగలెయ్యడానికోఏరుకుంటున్నఎండుకట్టెలోలె తోచినై..కాలం తీరినూకలు చెల్లిన నాడునా ఈ గతికి రూపమిచ్చిననా కన్నఊరు వొడిలోనేపిడికెడు బూడిదైపోయిరుణం తీర్చుకుందమనుకుంట..రక్తం పంచుకున్న నా బలగమంతపొట్ట సేత పట్టుకొనిచెట్టుకొకడు పుట్టకొకడైనట్టు దేశానికొకరైరి..నా వాడెవడో..! పరాయి ఎవడో..!బతకపోయిన కాడఇరుగుపొరుగే బలగం..పెదనాయిన చావుఒక నెపం మాత్రమే కాదు
నేటి జీవచ్ఛవాలకి ఒక సజీవ సాక్ష్యంరేపటి మృత్యువాతలకి ఒక సజీవ సంకేతం.. ...
- బైరెడ్డి కృష్ణారెడ్డి, 94400 72211

101
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles