ఏమై ఉండొచ్చు!


Mon,May 20, 2019 01:58 AM

ఒకసారి వాక్యం స్ఫురించాకదాన్ని లోపలికి తీసుకోకుండా వదిలేస్తేచటుక్కున అదెక్కడికో మాయమవుతుంది..
!ఎంత నిరీక్షించినా మళ్లీ వెనక్కిరాదువెతుకులాడినా దొరకదు, దొరికినా రేకులు రాలిన పూవులా ఏదో కొరత..అది కొమ్మల్లోంచి తెలియకుండా తలమీద రాలిన పండుటాకులాంటి వాక్యం!గభాల్న మబ్బుల్లోంచి జారిపడ్డ
అపురూపమైన వర్షపు చినుకు లాంటి వాక్యం
!రాత్రంతా పక్కనే ఉండిఉక్కిరిబిక్కిరి చేసి, మరుపులోకి జారుకున్న కల లాంటి వాక్యం!
గొంతెత్తి పలకలేక శతాబ్దాలుగా అణిగిమణిగి
అంగీకారం కోసం పెనుగులాడుతూ ఎగుస్తున్న వాక్యం..!
కాగితం ముందేసుకుని మనసురిక్కించి
ఎంత వెతికినా కానరాని వాక్యం..
తాపీగా గోడలమీద బొమ్మలు గీసుకుంటున్న సాలీడు
ఇటువైపు చూసి సంజ్ఞలు చేయదు
అదేపనిగా అటూ ఇటూ పరుగులుపెట్టే బల్లి
కిచకిచమని కొంచెమైనా చెప్పదు
గంటలు కట్టిన గేటు తన చప్పుళ్లతో గుర్తుచేయదు
ఏ పత్రికలోని వార్త, పుస్తకంలోని పేజీ..
దూరమైన ఆ వాక్యాన్ని నాదాకా చేర్చదు!
ఆ వాక్యమేమై ఉండొచ్చు-
పూవుల సామూహిక ఆత్మహత్య, పాదాలు మొలిచిన పొలం, నెత్తురోడిన వాడ, ఖైదుచేయబడ్డ కదలని వీల్ చైర్, విరిగిన చూపుడువేలు, మార్కుల హత్య, మాట్లాడని బావి, ఆహారపుటలవాటు, గుర్రాల సాక్ష్యం, కట్టని గోడ, అసహనం అంచుపై వేలాడే నేల...
కనుమరుగవుతున్న ప్రజాస్వామ్యంలాంటి ఆ వాక్యం
ఏమిటో..
ఎప్పుడు నా ముందు ప్రత్యక్షమవుతుందో తెలియనే తెలియదు...!

- యాకూబ్, 98491 56588

107
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles