వాల్టర్ డి లా మెర్


Mon,May 13, 2019 12:49 AM

(1873 ఏప్రిల్25-1956 జూన్ 22 )
walter-de-la-mare
ఆధునిక ప్రపంచ సాహిత్యరంగంలో, నిరంతరం బాల్యాన్ని పునర్దర్శిస్తూ కాల్పనిక ఊహకు పట్టం కట్టిన కవిగా, రచయితగా, బాల సాహితీవేత్తగా, హారర్ కథా రచయితగా వాల్టర్ పేరు సమకాలీన కవులలో ప్రఖ్యాతం! లండన్‌లోని కెంట్ ప్రాంతంలో ఓ అధికారి ఆరుగురు సంతానంలో ఒకడిగా జన్మించిన వాల్టర్, అంతంత మాత్రంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఓ ఆయిల్ కంపెనీ లో 18 ఏండ్ల పాటు పనిచేసి, బుక్ కీపర్‌గా ఉన్నకాలంలో రచనలు మొదలెట్టి, బాల సాహిత్యాన్ని, కవితలను విరివిగా రాశారు. Esperanza Dramatics Clubలో సభ్యుడిగా చేరి అక్కడే పరిచయమైన Elfridaను వివాహం చేసుకొన్నాక, వారి ఇల్లు ఓ సాహితీ నెలవుగా మారింది. తన 35వ ఏట 1908లో బ్రిటన్ Civil List Pension సాధించాక, వాల్టర్ తన పూర్తి కాలాన్ని రచనలకే అంకితం చేశాడు.
1902లో తొలి కవితా సంకలనం Songs of Childhoodను ప్రచురించి, ఆ తర్వాత The Poems (1906), The Listeners (1912), The Veil and Other Poems (1921), Burning Glass and Other Poems వంటి కావ్యాలతో పేరు సంపాదించినా, Memoirs of Midget (1921)నవలతో సాహితీ వినీలాకాశంలో ధృవతార స్థానాన్ని సాధించాడు!

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles