చెట్టు కూలితే..


Mon,May 6, 2019 01:08 AM

Man-under-tree
నేనిప్పుడు
ఓ చెట్టు గురించి ప్రస్తావిస్తాను
మనిషి ఆదికాలపు మూలాల్ని
తన వేర్లుగా మలుచుకుని
భూమి పొరల్లోకి విస్తరించుకుని
ఊడల్తో అనుబంధాల్ని
పెనవేసిందా చెట్టు!

మా తాత తండ్రుల్నుంచి
నాకు వారసత్వంగా వచ్చిందా చెట్టు
తన కొమ్మలతో
అమ్మతనాన్ని పంచింది
బాల్యంలో నా నేస్తాలతో
ఆ చెట్టు నీడలో
ఆడుకున్న జ్ఞాపకాలు
ఇంకా పచ్చిగానే ఉన్నాయి..!

ఎన్ని తుఫానులో
ఎన్ని గాలివానలనో తట్టుకుని
నిబ్బరంగా నిలిచింది!
చెట్టుని ప్రేమించడం
నాకు జన్మ లక్షణమైంది!

ఇప్పుడు నేను..
వృద్ధాప్యపు ఛాయల నీడల్లో
కంటినీళ్లు వొలకబోస్తున్నాను-
నా మనవడు నిర్మించే భవంతికి
నా ఆత్మబంధువైన చెట్టు అడ్డు వచ్చిందట
నా చివరి కోరికేంటంటే
నేను కూలిపోయింతర్వాత
ఏదైనా జరగాలి
చెట్టుకూలితే నేను కూలినట్టే..
నా మనవడు గ్రహించాలి...
-కె. హరనాథ్, 9703542598

161
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles