గతం జ్ఞాపకమవుతుంది


Mon,April 22, 2019 01:13 AM

GATHAM
కాల ప్రవాహంలో
మలుపులు పతాకాలై
రెపరెపలాడతాయి
లోయలు దుఖ్కాలై
లోలోపల బందీ అవుతాయి
కాలం గడిచినకొద్దీ
గతం జ్ఞాపకమవుతుంది
బహుశ ఇప్పుడు జ్ఞాపకాల్ని
మరిచిపోవాల్సిన తరుణమొచ్చింది
తుడిచివేయాలని ఎంత రుద్దినా
చెదిరిపోవడం లేదు సరిగదా
మరింత మెరుగులు దిద్దుకుని
ధగ ధగ లాడుతున్నాయి
అయినా మరిచిపోవడానికి
అవేమయినా కలలా
నడిచిన పాదాల సాక్షిగా
మరిగిన రక్తనాళాల సాక్షిగా
అవి నిజాలు కదా
నడిచి వచ్చిన రోజులూ
పరుగు పరుగున దాటిన క్షణాలూ
గెలుపోటముల్ని ధరించి
సవ్యంగానో అపసవ్యంగానో వెళ్ళిపోయాయి
నేనే
ఏమీ మాట్లాడకుండా
ఉండిపోయాను
మలుపు దారుల్లోకో లోయల్లోకో
తిరిగి ఒకసారి వెళ్ళాలనుకుంటాను
జ్ఞాపకాలుగా నాలోనే స్థిరపడ్డ
చోట్లకి వెళ్ళడం ఎట్లా
పైకి కనిపించే విస్తీర్ణమే కాదు
నేను లోపల మరింత విస్తారంగా
వినమ్రంగా వున్నా

పలికిన వాటికంటే పలకనివే అధికం
మలుపులకంటే లోయలే హెచ్చు
నేనేమో లోనికీ బయటకూ
కవిత్వం బహానాతో
లోలకమై కదులుతున్నా
కాలమేమో
నువ్వొక్కడివే కాదులేవోయి
అంటూ దర్జాగా వెళ్ళిపోతోంది

-వారాల ఆనంద్, 9440501281

118
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles