విలియం మెర్విన్


Mon,April 8, 2019 12:00 AM

(1927, సెప్టెంబర్ 30- 2019, మార్చి 15)
w-s-merwin
అమెరికా సాహిత్య చరిత్రలో దాదా పు ఏడు దశాబ్దాల పాటు తన రచనల తో, భావాలతో, భాషా ప్రయోగాలతో, జీవితంతో తన తరాన్ని, తన తర్వాతి తరాన్ని సమ్మోహన పరిచిన కవి, రచయిత, అనువా దకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త, పర్యావరణ వాది విలియం స్టాన్లీ మెర్విన్! Edward Hirsch వంటి ప్రముఖ కవులు ఆయనను మన కాలపు Thoreauగా కీర్తించారు! సాహిత్యానికి సంబంధించి అమెరికాలో ఉన్న అన్ని అవార్డులను గెలుచుకున్న మహా సృజనశీలి మెర్విన్! 1952లో తన మొదటి కవితా సంకలనం A Mask for Janus ప్రఖ్యాత Yale Younger Po -ets Prizeను సాధించడంతోనే ఆ పరంపర కొనసాగింది.

న్యూయార్క్‌లో జన్మించి, న్యూజెర్సీలో పెరిగి, ప్రిన్స్‌టన్ యూని వర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి, ఆ తర్వాత యూరప్ అంతా తిరిగి, అనువాదాలు చేసి, కొంత కాలం Tutorగా పనిచేసి తన తొలినా టి కవిత్వంలో మధ్యయుగాల నాటి భాషతో, పునరుజ్జీవన కాలపు సంప్రదాయ ధోరణినే పండించాడు. కానీ, 1956లో వెలువరిం చిన Green with Beasts, 1960 The Drunk in the Furnac -eతో మొత్తం తన శైలిని, కవితా రచనలోని మూస విధానాన్ని, Punctuation, Rhymeతో కూడిన కవితా సంవిధానాన్ని బద్దలు చేశాడు. ఇక 1967లో మెర్విన్ ప్రచురించిన The Liceతో వియ త్నాం యుద్ధంలో అమెరికా పాత్రను సూటిగా ప్రశ్నించి సంచలనం సృష్టించాడు. అంతేగాక, తాను రాసిన The Carrier of Ladde rs 1971వ సంవత్సరపు Pulitzer Prize గెల్చుకోగా వచ్చిన డబ్బును Resistance Movement (వియత్నాంపై అమెరికా చేసి న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పడ్డ సంస్థ)కు విరాళమిచ్చాడు.

1976లో జెన్ బౌద్ధాన్ని స్వీకరించి, హవాయిలో తాను నివ సించిన ప్రాంతంలో కనుమరుగైన అడవిని పునర్ స్థాపించిన మెర్విన్, ప్రకృతివాదాన్ని ప్రేమించి, నవీన యాంత్రిక సామాజిక చట్రాలను నిరసించాడు. ఇలా ప్రకృతికి దూరమవుతున్న మనిషితనాన్ని, పరాయీకరణ భావాలను ధిక్కరించి, నిరంతర సంవేదనాశీలిగా జీవించిన మెర్వి న్ కావ్యాలలో The Compass Flower (1977), Opening the Hand (1983), The Rain in the Trees (1988), The Vixen (1996), Migration (2005- National Book Aw -ard Poetry), The Shadow of Sirius (2009- Pulitzer Prize ), The Moon Before Morning (2014), Garden Time (2016) వంటివి ప్రస్తావించదగినవి.

నూతన సంవత్సరానికి..

చివరాఖరికి నువ్వు
ఏ ప్రశాంతతలోనైతే
లోయలో దర్శనమిస్తావో
ఆ నీ తొలి సూర్య కిరణం
కొంతమందినైనా
కొంచమైనా స్పర్శించడానికి
లోలోతుల్లోకి ప్రసరిస్తున్న క్షణాన
అలజడి ఎరగని ఆకులు
నీ ఆగమనాన్ని గమనించక
నువ్వెవరో తెలియక
మిన్నకున్న సమయాన
సుదూర దూరాల నుంచి
ఓ పావురం కువకువల రాగం
తనలో తానే గొణుక్కుని
ఉదయకాలపు సందడిలో ఆవిరైపోయాక
ఓహో, ఇది నువ్వు సృష్టించిన ధ్వనియా
ఇప్పుడే ఇక్కడే ఏమున్నా లేకున్నా
ఎవరైనా దాన్ని వినగలిగాక
మన వయసుతో పాటు
మనం చేరుకున్న లోకంలోకి
మన జ్ఞానం ఉన్నదున్నట్లుగానే
మన ఆశలు అక్కడి వారి మాదిరిగానే
మన కళ్ళ ముందరే అదృశ్యమై
ఎవరి చేతికీ చిక్కకుండా పోయినా
సాధించడానికి అనువుగా...
మూలం: విలియం స్టాన్లీ మెర్విన్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

222
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles