వేకెంట్ స్పేస్


Mon,March 18, 2019 01:11 AM

VECENT-SPACE
కొన్ని ఖాళీలు అలాగే ఉంటాయి
శూన్యపు చుక్కల్లా..
పూరించటానికి వీలులేకుండా!
అక్కడ మైసమ్మ గుడిపక్కనే
తెల్లదుస్తుల జంటొకటి నిలబడుండేది
దేహీ అనకుండా ధ్యానం చేస్తున్నట్టుండేవారు!
తీరికలేనట్టు పరిగెత్తే లోకం
లుక్కయినా వేసేదికాదు
లక్కేదో కలిసొస్తే కాణీ పరకా రాలేది
చేయిచాచని ఆ జంట
ఆశీర్వాదాలు అందరికీ గొడుగు పట్టేవి
చిరునవ్వును కప్పుకున్న
చిలకా గోరింకల్లా ఉండేవారు
ఆ దారంట వెళ్ళినప్పుడు
అయస్కాంతంలా ఆకర్షించేవారు
పదో పరకో ఇస్తే మనసు కాస్త తెప్పరిల్లేది
మాట పెగిలేదికాదు
ఆ చూపే అభయహస్తంలా ఉండేది
కాపు కాసే ధైర్యమై!
కాలానికేం కన్ను కుట్టిందో
వారిని జ్ఞాపకమై నిలబెట్టింది
గుడి ఉంది ఇప్పుడా గంధర్వ దేవతలు లేరు
పేరయినా అడగలేదు
మనసు రోదిస్తోంది
ఏదయితేనేం వాళ్ళు మనుషులు
ఫాతీమా రెహమాన్.. ఏదైనా కావొచ్చు
చూపులతో ప్రేమ పంచేవారికి పేర్లెందుకు
ఇప్పుడాదారో శూన్యంలా పూరించలేని ఖాళీలా...
- సి.యస్.రాంబాబు, 94904 01005

177
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles