ఏక్ చాయ్ మలాయ్‌కే సాత్!


Mon,February 25, 2019 01:10 AM

Hyderabadi-Irani
నేను చిన్నగున్నప్పుడు
ఈ గల్లీలన్నీ పెద్దగా కనిపించేవి
సినిమాహాల్ దగ్గరి పోస్టర్
ఆకాశమంత ఎత్తుగా ఉండేది!
నేను పెద్దయ్యాకా
తొవ్వలు చిన్నగయ్యాయి
టీవీలు వచ్చాకా
హోల్డింగ్స్ తగ్గిపోయాయి
అన్నిట్లో ఇంత మార్పువచ్చినా
మా సందుదగ్గరి హోటల్లో
ఇంకా బన్ మస్కా దొరుకుతుంది
కప్పునిండా చాయ్‌లో
ఎప్పటిలానే మలాయ్ తేలుతుంది
అప్పటిలానే మరాఠీ పిల్ల
మలుపుదాటుతున్నంత ఆనందంగా
మనసంతా రుచి రుచిగా ఉంటుంది
ఎమన్నా చేయండి
ఎన్నయినా చెప్పండి
ఏ మార్పు జరిగినా
హైదరాబాద్ అసలు ప్రేమ
పిసరంతైనా మారలేదు..!
ఎన్ని నగలు వేసుకున్నా, ఎవరెన్ని దోచుకున్నా
సంస్కృతిలో విలువలు తగ్గిపోలేదు.. ...!
- ఆశారాజు, 93923 02245

219
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles