బోరిస్ పాస్టర్‌నాక్


Mon,February 25, 2019 01:10 AM

(1890, ఫిబ్రవరి 10- 1960, మే 30)
boris-pasternak
ఆధునిక రష్యన్ సాహితీ ప్రస్థానంలో అగ్రస్థానంలో నిలిచే కవి, రచయిత, అనువాదకుడు బోరిస్ లియోనిడోవిచ్ పాస్టర్ నాక్! ఆయన తం డ్రి మాస్కో నగరంలో చిత్రకారుడు. తల్లి ప్రసిద్ధ పియానో విద్వాం సురాలు. తల్లి ప్రభావంతో 14వ ఏట నుంచి దాదాపు ఆరేండ్లు సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత సాహిత్యంలోనే తన జీవన సాఫల్యం అని తెలుసుకున్నారు. తన తొలి కావ్యం y sister life తోనే నాటి రష్యన్ సాహితీలోకాన్ని ఎంతగానో ఆకర్షించాడు..

గోయిదే, షేక్‌స్పియర్ వంటి ప్రముఖుల రచనలను రష్యన్ భాషలో అనువదించి ప్రపంచ సాహిత్యాన్ని రష్యన్లకు పరిచయం చేసిన బోరిస్, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కవితలు కొన్నింటిని కూడా అనువదించాడు. ఆయన రాసిన ఒకే ఒక్క నవల Doctor Zhivago (1957) ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిం చి, ఆ తర్వాత అదేపేరుతో హాలీవుడ్‌లో సినిమాగా కూడా తెరకె క్కింది. 1905 నాటి రష్యా విప్లవానికి, రెండో ప్రపంచ యుద్ధానికి మధ్యకాలంలోని రష్యన్ దేశ పరిణామాలను, కమ్యూనిస్టుల పాల నలోని నేతల తీరును, ప్రజల్లోని నైరాశ్యాన్ని, కమ్యూనిస్ట్ స్వర్గంలో ని చీకటి కోణాలను ఈ నవల ప్రపంచానికి వెల్లడించింది. ఆ సమయంలోనే 1958 సంవత్సరపు నోబెల్ బహుమతిని ప్రకటిం చడం, క్యాపిటలిస్ట్ సామ్రాజ్యవాదపు చర్యగా భావించిన రష్యన్ ప్రభుత్వం బోరిస్‌పై ఆంక్షలను ఆగ్రహాన్ని ప్రకటించింది. దానికి తలొగ్గిన బోరిస్ నోబెల్ బహుమతిని తిరస్కరించాడు. మరణించే వరకూ కూడా నిరంతర నిఘాలోనే జీవితాన్ని గడిపిన బోరిస్, చివరిదాకా ప్రజాస్వామ్య స్వేచ్ఛా భావనలను ఇష్టపడి, వాటికోసం తపన పడ్డాడు.

188
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles