పుల్వామా స్మృతిలో..


Mon,February 25, 2019 01:09 AM

మంచుచెట్టుకు
ఎర్రటి పూలై విచ్చుకున్నాయి
తెల్లటి కొండలు
రక్తపుటేరులై దర్శనమిస్తున్నాయి!

ఊహకు ఆపద అందినా.. అందకపోయినా
ముందే తెలిసినా.. ఉచ్చు తెలియకపోయినా
దూరదృష్టిలేని నిర్లక్ష్యానికి
రక్షకులకు శిక్ష..!
అపనమ్మకపు ఆలోచనకు
నిండు ప్రాణాలుబలి!
దారంటా
ఎంతెంత మంది జవానులుంటేనేం?
పొడుగుతా
ఎన్నెన్ని వాహనాలు వెనువెంటే వస్తేనేం?
ఏ రూపేణా జరుగుతుందో దాడి
ఎక్కడ ఎదురవుతుందో ప్రమాదం
చంపి సాధించే గొప్పతనాన్ని
ఏ దేశమూ ఒప్పుకోదు !

ఏ ఒక్క పౌరుడూ
తలెత్తటానికి వీల్లేదు
వెంటనే గొర్ల్రై తలలు దించండి!
ఎవడు నేర్చిన విద్య?
ఈ ఆత్మాహుతి మరణశాసనం
రాయించిందెవడు?

నేర్పిన వాణ్ణి నేర్చిన వాణ్ణి
పసిగట్టి కూడా
పట్టలేని మట్టుపెట్టలేని
చేతగాని వాళ్ళం కాదుగదా!
విషాదపు మరకలు
ఎంత కడిగినా పోవు..
వీర జవానుల చావులు
ఎంత ఏడ్చినా తిరిగి పుట్టవు..!
- కందుకూరి శ్రీరాములు, 94401 19245

212
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles