నడక


Mon,February 18, 2019 01:32 AM

man-alone
నేనట్లా అలసటను వెంటేసుకొని
అడుగు తీసి అడుగేస్తూ
నడుస్తూనే వున్నా..
కాలం నన్ను ముందుకు తోసి
వెనకకు వెళ్తూనే వుంది!
నడకదేముంది
శరీర కదలిక
గులక రాళ్లూ.. ఇసుక తిన్నెలూ..
చిక్కటి అడవీ.. కటిక చీకటీ..
అనుభవాలు పాదముద్రల్లో
భద్రమవుతున్నాయి
యథాలాపంగానో
కావాలనో నన్ను అడగకు
ప్రయాణం ఎక్కడిదాకా అని
ఏమని చెప్పను.. గమ్యం
నాకు తెలిస్తే కదా
నడకేమో
కనిపించే వెతుకులాట
మనసేమో
వినిపించని పలవరింత
నడక సాగుతూనే వున్నది
మనసు తేరుకునే ఉన్నది
ఇక..
తెలియన్ది తెలుసుకోవడమే
తెలిసింది పంచుకోవడమే...
- వారాల ఆనంద్, 94405 01281

300
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles