చైనా పద్యాలు


Mon,February 11, 2019 12:58 AM

chaina
గాంధీ అంటే
గౌరవముందిక్కడ
మనమే
మరిచిపోతున్నాం
ఎక్కడున్నానో
అనిపించింది
నేను నా హృదయంలోనే
ఉన్నానని తెలిసింది
బీజింగ్ మాండలికమే
అధికార భాష.
ఉత్తరాదిన
మన హిందీలాగ
పగోడాలోంచి
బయటికొచ్చాను
నా హృదయంలో
జెన్ బౌద్ధం కొట్టుకుంటుంది
మాట ముఖ్యమా
మౌనమా అని కాదు
స్పందన ఎలా వుందన్నదే
ప్రధానం
చైనా ఛాయ్
చేదుగా వుంది
అయినా తాగాలనిపిస్తుంది
నీ జేబు
నిండింది సరే
మొయ్యలేవు
పక్కదాంట్లో కొంచెం వెయ్యి
అది బుల్లెట్ ట్రెయినే
కాలాన్ని చీలుస్తూ
అతికిస్తూ వెళ్తుంది
నా కనుల మబ్బుల్లో
నీడలు కావవి
పసిఫిక్ మహా సముద్రం
లోతులు
మృత్యువును
మోసం చెయ్యాలనుకున్నాడు
అవును
కవిత్వం రాశాడు
- డాక్టర్ ఎన్.గోపి

204
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles