నడకకి చిన్న బ్రేక్ ఇచ్చాక


Mon,February 11, 2019 12:57 AM

bird
కాస్మిక్ ప్రపంచంలో
స్వర్గపు స్వచ్ఛతని కొలుస్తూ పోతూనే ఉంటాం మనం
కప్పబడ్డ దూరం,
చిన్ననాటి నుండి మన కళ్ళను
ఆకర్షిస్తూనే ఉంటుంది
నిరాశ్రయమైన ఎన్ని స్వప్నాలు
రక్తాన్ని స్రవిస్తూ తిరుగుతున్నాయో తెలుసా
వాటిని నక్షలుగా గీయటం
నాకో ఆశ్చర్యం ఇప్పటికీ.
మృదువైన గాలులు
ఆకుపచ్చ మొక్కజొన్నలను ఎక్కి ఊగేప్పుడు,
పక్షిరెక్క నీలపు ఆకాశాన్ని ముక్కలుగా చేసేప్పుడు,
మేఘాలు, గొఱ్ఱెలు,
సముద్రపు ఏకాంతరేఖకి సమాంతరంగా
ప్రయాణించేప్పుడు
కొంచెం నడకని ఆపి ధ్యానిద్దాం
సన్నని లావుపాటి దేహాలు
తెల్లని ఎర్రటి నల్లటి చర్మాలూ
చెల్లాచెదురుగా నడిచేప్పుడు
గమ్యమేంటని పక్షుల్లాంటి కళ్లతో చూసేవాళ్లని అడగాలి
స్వేచ్ఛని బొమ్మగీసి చూపించమని
వాళ్లు సరే
దూరం
నడక
రెక్కలు
స్వేచ్ఛని ఏమని నిర్వచిస్తాయో..
- మెర్సీ మార్గరెట్, 90528 09952

247
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles