మృత స్వప్నం!


Mon,February 4, 2019 01:45 AM

ఇక్కడ ఓ స్వప్నం
మృతిచెంది పడి ఉంది
ఈ ప్రదేశం గుండా నువ్వు
నెమ్మదిగా నడువాల్సి ఉంటుంది సుమా!
నీ కళ్లను మరోవైపు తిప్పుకొని
నీ చూపుల భారాన్ని తెల్సుకునే ప్రయత్నం చేయకు
జీవించటం కోసం
జీవిత పోరును తట్టుకోలేక మరణించిందని
విషాద పాదాలతో నడువకు
కానీ, నీ అడుగుల్ని మాత్రం నెమ్మదిగా వెయ్యి!
నా మాటమీద దయ ఉంచి
మీ మధురమైన వివేకాన్ని ఉపయోగించి
ఆటలలో ఆశలని, వసంతాన్ని,
లేలేత ఆకాశాన్ని చూపించు!
ఇప్పటికి ఆ విషయం
దుఃఖితులందరికీ తెలిసిపోయింది.
ఇక్కడ ఒక స్వప్నం నిర్జీవమై పడి ఉందని!
ఎప్పుడైతే ఒక పండుటాకు
చెట్టు కొమ్మలలోంచి రాలిపోయిందో
పూర్వం తనలో ఉన్న ధవళ వికసనం
నిరీక్షిత జన్మల గర్వపు ఆవిష్కారం స్తంభించిందో
అప్పుడే ఒకింత ప్రేమత్వం కూడా
కనిపించకుండాపోయింది
అలాగే, సౌందర్యం కూడా
తన అసంపూర్ణ శిరస్సును
నిస్ర్తాణయై వాల్చేసింది!
ఎందుకంటే..
ఆ చిరస్వప్నం మోహావేశ పరవశమై
వాంఛిత మృత్యువుతో జత కూడింది!!
మూలం: డొరొతీ పార్కర్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

280
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles