డొరొతీ పార్కర్


Mon,February 4, 2019 01:45 AM

-(1893, ఆగస్టు 22-1967, జూన్ 7)
సృజనాత్మకత, హక్కుల పోరాటం, రాజకీయ సిద్ధాంతం, విస్తృత సాహితీ వ్యవసాయం, జర్నలిజం, సినీరంగ ప్రస్థానం- అన్నింటినీ ఒక్కచో ట కలిపితే ప్రత్యక్షమయ్యే మానవ రూపం.
- డొరొతీ షిల్డ్ పార్కర్!
అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో స్కాటిష్ తల్లికీ, జర్మన్ యూదు తండ్రికీ జన్మించిన డొరొతీ, తన 5వ ఏటనే తల్లిని కోల్పోయింది. తండ్రి మరో స్త్రీని పెళ్లాడటం నచ్చని డొరొతీ, తండ్రికీ, సవితి తల్లికీ దూరంగానే పెరిగింది. జీవిక కోసం కొద్దినాళ్లు పియానో టీచర్‌గా పనిచేసినప్పటికీ తర్వాత జర్నలిస్ట్‌గా, రచయితగా Vogue, Vanity Fair వంటి పత్రికల్లో పనిచేసిం ది. ఆ తర్వాత కొంతమంది మిత్రులతో కలిసి Algonquin Roun -d Table పేరిట ఒక రచనా ఉద్యమాన్ని ప్రారంభించి, సమకా లీన అంశాలపై వ్యంగ్యంగా, చతురంగా, సరదా వ్యాఖ్యలతో రచనలు చేసి విస్తృత ప్రజాదరణ ను సాధించింది.
1914లో తన 21వ ఏట తొలి కవితను Vanity Fair పత్రిక లో ప్రచురించిన డొరొతీ, 1926లో తన తొలి కవితా సంకలనం Enough Ropeతో మొదలుపెట్టి Sunset Guns (1928), Deat -h and Taxes (1931), Not So Deep As Well (1936) వంటి కావ్యాలను ప్రచురించింది. కథలను, నాటకాలను రచించిన డొరొతీ, ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలకు రచనలు చేసి A Star is Born (1937) సినిమాకు, Smash-Up, the Story of A Woman (1947) సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత్రిగా ఆస్కార్ అవార్డుకు నామినేషన్లు పొందింది.
Dorothy-Parker
1930 దశకంలో సం భవించిన ఆర్థిక మాంద్యం కాలంలో వివిధ పౌరహక్కులు, మాన వ హక్కుల సంస్థలతో కలిసి చురుకుగా పనిచేసింది. 1936లో Hollywood Anti-Nazi League హక్కుల పేరిట ఒక మేధో బృందాన్ని స్థాపించి, నాటి ప్రపంచంలో విజృంభించిన ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడింది. అలా స్వేచ్ఛా భావనల కోసం, ప్రజా హక్కుల కోసం పోరాడిన డొరొతీని కమ్యూనిస్టుగా భావించిన అమెరికా FBI ఆమెపై 1000 పేజీల నివేదికను రూపొందించింది. దీంతో హాలీవుడ్ సినీ ప్రపంచం 1949లో డొరొతీపై నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత మద్య వ్యసనానికి అలవాటుపడిన ఆమె, చివరివరకూ నిత్య సంచలనాలకు మారుపేరుగా నిలిచింది.

291
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles