దేవులపల్లి గోపాల్ కిషన్‌రావు కునివాళి


Mon,February 4, 2019 01:41 AM

తొలితరం జర్నలిస్టు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధు డు దేవులపల్లి గోపాల్ కిషన్‌రావు తన 83వ ఏట తుదిశ్వాస విడిచారు. జీవితాంతం విలువల కోసం, మానవీయ సమా జం కోసం పరితపించిన అవిశ్రాంత యోధుడు ఆయన. గోలకొండ పత్రికకు ఆ రోజుల్లో న్యూస్ కాంట్రిబ్యూటర్‌గా పనిచేశారు. నిజాం ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు వ్యతిరేకం గా ప్రజాచైతన్యం కోసం పనిచేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష, అణిచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నవ యువ రచయితలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. ఆయన ఆశయసాధన కోసం నేటితరం యువ రచయితలు నిబద్ధతతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని దేవులపల్లి ప్రభాకరరావు, ప్రభాకర్ జైని, వనం లక్ష్మీకాంతరావు, ఎం.వి.రంగారావు, అంపశయ్య నవీ న్, రమా చంద్రమౌళి తదితరులు పిలుపునిచ్చారు.
- వాణీ దేవులపల్లి, 98669 62414

187
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles