యాత్ర!


Sun,January 27, 2019 11:55 PM

చివరికి ఒకానొక రోజు..
అసలు నువ్వు చేయాల్సిందేమిటో
నువ్వు తెల్సుకుంటావు
అప్పుడు నువ్వు నీ యాత్రను ఆరంభిస్తావు
నీ చుట్టూ ఉండే గొంతులన్నీ
అరుపులు, కేకలతో నిన్ను వారిస్తాయి
మొత్తం ఇల్లు ఇల్లంతా
ప్రకంపించడం మొదలెడ్తుంది
అప్పుడు ప్రాచీన బంధనమేదో
నీ కాళ్ళను కట్టి పడేసినట్టనిపిస్తుంది
ప్రతి స్వరమూ..
నా జీవితాన్నిచక్కదిద్దు అని ఆక్రందిస్తుంది
అయినా నువ్వు ఆగవు!
నువ్వేం చేయాల్సి ఉండిందో
ఇప్పుడు నీకు తెల్సిపోయింది
మూలాల నుంచే నిన్ను పెకిలించడానికి
గాలి తన బలిష్టమైన చేతి వేళ్ళను ప్రయోగించి
విషాదంలోని బీభత్సాన్ని ప్రత్యక్షం చేస్తుంది !
ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక చాలు
ఇక్కడంతా..
కాల రాత్రి, గమ్యం తెలియని దారి
విరిగిపడ్డ చెటు్లు కొమ్మలు..
దారి అంతటా జారిపడ్డ రాళ్ళు-కొండలు..
కొంచెం కొంచెంగా నువ్వు
ఆ గొంతుల ఆదేశాలను వదిలించుకుంటూ
దూరంగా జరుగుతూ వెళుతున్న క్షణాన-
మబ్బుల దొంతరలోంచి
నక్షత్ర జ్వలనం రాజుకుంటుంది
నెమ్మది నెమ్మదిగా
ఓ కొత్త స్వరం పలుకేదో దగ్గరవడం నీకు తెలుస్తుంది
అనతికాలంలోనే
ఆ స్వరం నీదే అని కూడా నీకు ఎరుకవుతుంది
ప్రపంచం లోలోతుల లోతుల్లోకి
నువ్వు పెద్ద పెద్ద అంగలతో దూసుకెళ్తూ
నువ్వు చేయగల్గిన ఒకే ఒక్క పనిని
నువ్వు చేయాలని నిర్ధారించుకున్న నిమిషాన
నీకు నువ్వే, నీ స్వరం మాత్రమే తోడు అని
నీకు ఖుల్లవ్‌ు ఖుల్లాగా సమజవుతుంది!
ఆఖరికి ఒకానొక రోజు ..
నువ్వు రక్షించాలని నిశ్చయించుకున్న జీవితం..
నువ్వు మాత్రమే కాపాడగలిగిన జీవితం..
రెండూ ఒక్కటే అని నీకు జ్ఞానోదయమవుతుంది.. ..!
మూలం: మేరీ ఆలివర్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

241
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles