మేరీ ఆలివర్


Sun,January 27, 2019 11:55 PM

-(1935, సెప్టెంబర్ 10-2019, జనవరి 17)
అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ కవయిత్రిగా 2007లోనే ప్రఖ్యా త న్యూయార్క్ టైవ్‌‌సు పత్రిక ప్రశంసలు పొందిన సృజనమూర్తి మేరీ జేన్ ఆలివర్! ఒక కవి తన జీవితంలో ఇన్ని పుస్తకాలు రాయగలుగుతారా? అని ఆశ్చర్యపడేంతగా సంఖ్యాపరంగా అన్ని పుస్తకాలు రాసి, ప్రచురించిన సంపూర్ణ సాహితీ స్రష్ట ఆమె. ఒక ఉపాధ్యాయుడి కూతురిగా జన్మించిన మేరీ, బాల్యంలో లైంగిక వేధింపులకు గురై, దాని తాలూకు పీడకలలతోనే జీవిత పర్యంతం బాధపడింది. గ్రామీణ జీవితం నుంచి రావడం వల్ల ఆమె, జన సమూహంలో కన్నా ప్రకృతి సమక్షంలో గడుపడాన్నే ఎక్కువగా ఇష్టపడే ది. తన 14వ ఏటనే కవితా రచనను ప్రారంభించిన ఆమె, తన 17వ ఏట ప్రముఖ కవి Edna Vincent Millay రచనల చేత ప్రభావితమైంది. ఆ తర్వాత Thoreau, Walt Whitman సాహిత్యాన్ని ఎంతగానో ఇష్టపడిన ఆమె, తన 28వ ఏట 1963లో No Voyage and Other Poems పేరుతో తొలి కవితా సంకల నం ప్రచురించింది. ఆ తర్వాత The River Styx (1972), The Night Traveller(1978), Twelve Moons (1979), Dre -am Work (1986), House of Light(1990), The Blue Partners (1995), The Leaf and Cloud (2000), Why I Wake Early (2004), Red Bird (2008) వంటి ఎన్నో కావ్యాలను ప్రచురించింది.
MARY-OLIVER
ఆమె రాసిన American Primitive కావ్యానికి 1984లో ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతిని, New and Selected Poem sకి 1992 National Book Awardను గెల్చుకుంది. Prose Poems పేరిట వినూత్న ప్రయోగాలు చేసిన మేరీ, ఈ శైలిలో White Pine (1994), West Wind(1997), Winter Hours (1999), Swan (2010) వంటి కావ్యాలను కూడా రాసింది.

397
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles