బెర్టోల్ట్ బ్రెక్ట్


Sun,January 6, 2019 11:18 PM

(1898, ఫిబ్రవరి 10-1956, ఆగస్ట్ 14)
BERTOLT-BRECHT
20వ శతాబ్దపు ప్రపంచాన్ని మేధోప రంగా ప్రభావితం చేసిన నాటక కర్త, కవి, మార్క్సిస్ట్ మేధావి యూజీన్ బెర్టోల్ట్ ఫ్రిడ్రిక్ బ్రెక్ట్! జర్మనీలోని బవేరియా ప్రాంతం ఆగ్స్‌బర్గ్ పట్టణంలో జన్మించిన బ్రెక్ట్, తన తల్లి ద్వారా చిన్ననాడే బైబిల్‌ను ఆసాంతం చదివాడు. అది ఆయ నలో ఎన్నెన్నో ప్రశ్నలను లేవనెత్తి దాని ప్రభావం ఆయనలో సరికొ త్త భావజాలం ఎదుగటానికి తోడ్పడింది.
బ్రెక్ట్‌కు 16వ ఏట మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైనప్పు డు, తోటి విద్యార్థులంతా సైన్యంలో చేరగా తానుమాత్రం అందు కు నిరాకరించడంతో పాఠశాల నుంచి బహిష్కృతుడైనాడు. ఆ తర్వాత ఎలాగో మ్యూనిక్ యూనివర్సిటీలో వైద్య విద్యలో చేరిన ప్పటికీ అక్కడ నాటకాల వైపు ఆకర్షితుడై 1918లో Baal నాటకా న్ని తొలిసారిగా ప్రదర్శించి ఒక్కసారిగా ప్రజల దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత ఎన్నో నాటకాలు రాసి, వేసి నాటకరంగంలో ఆధునిక ప్రయోగాలెన్నింటినో చేసి, Epic Theatreకు ఆద్యుడిగా నిలిచా డు. బతికినంత కాలం మార్క్సిస్ట్‌గా బతికి ప్రపంచాన్ని, జీవితాన్ని గతితార్కిక భౌతికవాద కోణం లోంచే అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన బ్రెక్ట్, రెండో ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్‌కు వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను, 1933లో జర్మనీని వదిలి ప్రవాసాన్ని గడుపాల్సి వచ్చింది. ఆ కాలంలో డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ దేశా ల్లో తలదాచుకున్నాడు. అనంతరం అమెరికాకు వెళ్లిన బ్రెక్ట్ అక్కడ ఎన్నో నాటకాలను సృష్టించడమే కాక, The Hangman Also Die! సినిమాకు స్క్రీన్ ప్లే కూడా రాశాడు. కవిగా బ్రెక్ట్ తన యవ్వన ప్రాయంలోనే, అంటే 1914లోనే జానపద కథల ప్రభా వంతో తొలి కవితను రాసి, ఆ తర్వాత నాటకాల్లో భాగంగానూ, విడిగానూ వందలాది కవితలు రాశాడు. సమస్త రకాల అణిచివే తలపై ప్రజల్లో తిరుగుబాటుకు చోదకశక్తిగా కళ ఉండాలని నమ్మి, ఆచరించి, నిరూపించిన బ్రెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతో మంది నాటకకర్తలకు, కవులకు, నిత్య స్ఫూర్తిగా వెలుగుతున్నాడు!

అసలేం జరిగింది?

ఒకానొక పారిశ్రామికవేత్త
తన విమానానికి మరమ్మతులు చేయిస్తున్నాడు
ఒక ఆధ్యాత్మికవేత్త
ఎనిమిది వారాల క్రితం నాటి తన ప్రవచనంలో
ఏం చెప్పానోనని ఆశ్చర్యపోతున్నాడు
సైనిక దళపతులంతా పౌరులుగానూ
బ్యాంక్ గుమాస్తాల్లాగానూ కనిపిస్తున్నారు
ప్రభుత్వ ఉద్యోగులంతా
మైత్రీ పూర్వకంగా మెళుగుతున్నారు
ఖద్దరు టోపీ పెట్టుకున్న ఒకానొక మనిషికి
రక్షకభటుడొకరు దారిని చూపిస్తున్నాడు
అద్దెకిచ్చిన తన భవనంలో
నీటి సరఫరా సాగుదల గురించి కనుక్కోవడానికి
యజమానే స్వయంగా వచ్చాడు
జర్నలిస్టులంతా తాటికాయంత అక్షరాల్లో
ప్రజలు అని పత్రికల్లో రాస్తున్నారు
గాయకులంతా గొంతెత్తి పాడుతున్నారు
ఓడల కెప్టెన్లు తమ సిబ్బంది బసలో
ఆహారం ఉందా అని ఆరా తీస్తున్నారు
కార్ల యాజమానులు తమ డ్రైవర్ల పక్కన కూర్చుంటున్నారు
వైద్యులంతా బీమా కంపెనీలపై దావాలు వేస్తున్నారు
మేధావులంతా తమ అలంకరణల్ని దాచుకుంటూ
ఆవిష్కరణలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు
రైతులు తాము పండించిన బంగాళాదుంపల్ని
సైనిక శిబిరాలకు చేరవేస్తున్నారు
నిజానికి జరిగిందేంటో తెలుసా?
విప్లవం తన తొలి యుద్ధాన్ని గెలిచింది!!
మూలం: బెర్టోల్ట్ బ్రెక్ట్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

434
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles