కొత్త సంవత్సరం-ఓ సంభాషణ!


Sun,December 30, 2018 11:04 PM

మనిషి
ఈ రాత్రి ఎంతో చల్లగా ఉంది
చాలా పొద్దు పోయింది
ప్రపంచమంతా విషాదంగా, నిరుత్సాహంగా ఉంది.
ఇలాంటి సమయాన నా ఇంటి తలుపును కొడుతున్నదెవరు?
కొత్త సంవత్సరం
నేను ఆనందాన్ని
మనిషి
నీ గొంతు కొత్తగా ఉంది నువ్వెవరో నాకు తెలియదు
నేను నిశీధి నీడల్లో ఉన్నాను
ఎందుకోసం వచ్చావు నువ్విక్కడికి?
కొత్త సంవత్సరం
మిత్రమా! నన్ను లోపలికి రానివ్వు
నేను ఆశను, జీవనేచ్ఛను!
మనిషి
నాదంతా వైఫల్యాల గాథ
పరాజితుడి జీవితాన్ని పావనం చేద్దామని వస్తున్నావా
వెళ్లిపో..రావద్దు.. వెళ్లిపో!
కొత్త సంవత్సరం
ముందు నీ తలుపులను బార్లా తెరువు
నేను విజయాన్ని!
మనిషి
కానీ నేను జబ్బుపడి తీవ్ర వేదనలో మునిగి వున్నాను
చాలా ఆలస్యంగా నీ సంపదలు నన్ను చేరాయి
ఇప్పుడిక నేను వాటిని ఉపయోగించలేను
కొత్త సంవత్సరం
మిత్రమా! ఒక్కసారి విను..నేను మంచి ఆరోగ్యాన్ని!
మనిషి
ఇప్పుడు నా తలుపును పూర్తిగా తెరుస్తాను, లోపలికిరా
నువ్వు చెప్పినవన్నీ నిజమో కాదో తేలుస్తాను
కొత్త సంవత్సరం
కానీ ఒక్క షరతు - నువ్వు నీ తలుపుని మాత్రమే కాదు
నీ హృదయాన్ని కూడా బార్లా తెరవాలి... నేను ప్రేమను!
మూలం: ఎల్లా వీలర్ విల్ కాక్స్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

ఎల్లా వీలర్ విల్ కాక్స్

(1850 నవంబర్ 5-1919 అక్టోబర్ 30)
ella-wheeler-wilcox
నువ్వు నవ్వినప్పుడు ప్రపంచం నీతో పాటే నవ్వుతుంది. నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు మాత్రమే ఒంటరిగా ఏడువాల్సి వస్తుంది అనే వాక్యంతో చిరస్మరణీయతను సాధించిన కవయిత్రి ఎల్లా వీలర్ విల్ కాక్స్! మేధావుల కుటుంబంలో జన్మించిన ఎల్లా, తల్లి చేత ప్రభావితమై చిన్ననాటి నుంచే పుస్తక అధ్యయనాన్ని అలవరుచుకుంది. తన మనోభావాల వ్యక్తీకరణకు కవిత్వమే సరైనదని భావించి 8వ ఏట కవితా రచనను మొదలెట్టి, 13వ ఏట తొలి కవితను ప్రచురించిం ది. అయితే ఎల్లా కుటుంబం వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి నందువల్ల పత్రికలు కొనడం కష్టమైన పరిస్థితుల్లో, పత్రికల్లో తన కవిత ప్రచురితం అయితేనైనా తనకు ఆ పత్రికను పంపిస్తారనే ఆశతో కవితా రచనను సీరియస్‌గా తీసుకుంది. 1884లో వివా హం తర్వాత, ఎల్లా దంపతులకు ఒక బాలుడు జన్మించి, బాల్యం లోనే మరణించాడు. దాంతో వారు దివ్యజ్ఞానం వైపు, ఆధ్యాత్మిక త వైపు తమ దృష్టిని మరల్చారు. పునర్జన్మ వంటి అతీత విషయాల ను నమ్మిన ఎల్లా తన ఇంటినే సాహితీ చర్చా కార్యక్రమాల వేది కగా మలిచి, అమెరికాలో New Thought Moveme -nt వ్యాప్తి కి కృషిచేశారు Drops of Water (1872)తో మొదలు పెట్టి She -lls (1873), Poems of Passion (1883), Poems of Plea -sure (1888), A Woman of the World (1904), Poems of Reflection (1905), Poems of Peace (1906), Poems of Experience (1910) వంటి కావ్యాలతో అమెరికాలో Popular Poetesగా పేరుపొందారు!

704
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles