నోముల.. సకల కార్‌నామా!!


Sun,December 30, 2018 11:04 PM

nomula
డాక్టర్ నోముల సత్యనారాయణ గారంటే ఒక సాహిత్య సందోహం. ఒక బక్కపలుచని మనిషి. తలమీద టోపీతో ఎడమచేత సిగరెట్‌తో సాదాసీదా మనిషే అయినా పెద్ద మానసి అవ్వడమే అతనికి ఒక కితాబు. అసలుకాయనొక తన సమకాలీకులలో కూడా యువకుడయ్యే ఖరార్ నామా. పెద్ద ఈడైనా నవ పథికుడు. యువకులలో యువకు డు. ఆలోచనలు పంచుకుంటూనే మాంచి పంచులతో సర్వులనూ అలరించే గొప్ప కార్ఖానా. గ్రామర్ ఆయనకొక టానిక్ అయి తే గ్లామర్ ఆయన పంచే రసాయనిక టెక్నిక్. చంకలో పుస్తకాలు వేళ్ల మధ్య అగ్ని హోత్రం అన్నట్టుగా ఆనందం రువ్వే వారి ముఖం చదువరులకెప్పుడూ ఒక పుస్తకంతోడి ఆముఖం. ఆయనతో నడుస్తూ పోవడమంటే విశ్వవిద్యాలయాల మెట్లెక్కకుండానే అప్రకటిత డిగ్రీలను సొంతం చేసుకోవడం. క్రియాశీలతలు, అధ్యయనదారులు, అనవరతం వారికి చర్చొపచర్చల మీద ప్రేమలు. అవే వారిని అలవోకగా పట్టిఇచ్చే రసోద్రకపు తీరులు. ఆయనతోటి మైత్రి ఆసాంతం ఆనందాబ్దులను చేదుకోగల వైచిత్రి. నల్లగొండలో, మరెన్నో తావుల్లో సుతా నోముల వారి అస్తిత్వం అంటేనే అదొక నడుస్తున్న విశ్వవిద్యాలయపు జాడ. అతడెక్కడుండే అక్కడ అది సద్‌తార్కికతల వాడ. ఆయన చిరునామా నోముల ఉరఫ్ జయహో. ఆయన పొట్టి పేరు సత్యం సదసత్ వివేకంతోనే అనవద్యం పయనం. వారే కాయిన్ చేసినట్టు-జయహో. వారి చిరునామా. ఉరఫ్ ఎల్లెడలా సత్యసమ్మతంగానే సకల కార్‌నామా!!
- వేణు సంకోజు, 8309963960

417
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles