చిత్రజాల


Sun,December 30, 2018 11:03 PM

పిడి ఇప్పిన వల
యదన ముంచి
రెక్కలతో ఇసిరి గీసిన
భూ మండలంలా
గుండ్రని చిత్రమాల
బతుకు గుండంలో
మెతుకులు ఈదుతున్నాయి
బువ్వకుండ నీటి అడుగున ఉడుకుతుంది
అంతరాంతరాల్లో అంతస్సారం
గాలి కాదు ఘనీభవించేది కాదు
కండ్ల సాక్షిగా
చెరువులు కుంటలు మడుగులు
కత్వలు కన్నమ్మశాకిరీలు
ఎన్ను సరుసుకొని
కార్తుల్ని ఈరబోసుకున్న శివ బోయుడా
నడిజెర్ల మునిగి తేలుతున్నావ
నీటిని ఉరికిచ్చి
యేటిని కట్టేసినోడా
కదురు తిరిగి
ఎలుమాడిన ఎన్నికన్నులల్లినా
కానని లోకంలో యద కన్నీరే కదా
చెరువు చెట్టు పుట్ట
పిట్ట ఎంకన్నలు వర్ధిల్లుతాయా
నేనెక్కడ?.. ఎవరితో పోటి?
ఇంకా విస్తరించని ఒడ్డును
జెర చెలగపిట్ట చెల్గుతుంది
దరి మీన కొంగ నీల్గుతుంది
బుడబుంగ మొక్కులు
తీరుతయో తీరవో కాని
గుండములో మునిగి తేలుతుంది
దీపాలు కురిసినంగ
నీటి అంచున.. అలుగు వెలుగుతుంది
తలలో తెడల మీన
తడిసిన నా బొమ్మ మీన
రంగుల నిధి మునుగుతూ తేలుతుంది
-మునాసు వెంకట్, 9948158163

395
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles