మా ముఝే అప్నే ఆంచల్ మే ఛుపాలే!


Sun,December 23, 2018 11:01 PM

అ మ్మా !
నువ్వు నా పక్కన లేంది చూసి
జడల రాక్షసిలా
ఈ చీకటి బెదిరిస్తుందే!
దీపం ముట్టించి పెట్టినా
గోడమీద కదిలే
నీ నీడ తోడు లేకుంటే
ఈ రాత్రంతా భయమేస్తుందే !
నీ వొడిలో నిద్రించకపోతే
మంచు కురిసి, కాళ్ళు చేతులు
నీళ్ళ మీద తేలిన
కట్టెలైపోతున్నయే!
నువ్వు దూరమైతే
అడవిలో ఎదురు తిరిగిన
ఏనుగుల గుంపుల్లా మీదపడి
తుఫాన్లు ఎత్తుకపోతున్నయే!
నా తలమీద నీ కొంగులేకుంటే
వర్షం జాడించి జాడించి
దవడలు పగిలేలా
ముఖం మీద చరుస్తున్నదే!
ఎక్కడా నువ్వు కనబడకపోతే
సూర్య చంద్రులు వెంటబడి
రాత్రిని పగలని చెప్పి
పగటిపూటని రాత్రని అబద్ధమాడి
నన్ను పిచ్చోన్ని చేసి ఏడిపిస్తున్నరే!
అమ్మా!
నువ్వు లేని ఈ లోకం
దావానలం చుట్టుముట్టిన
దండకారణ్యంలా వుందే !
- ఆశారాజు, 93923 02245

226
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles