సరస్సు పక్కన..!


Sun,December 2, 2018 11:15 PM

నేలనంతా కప్పేసిన మంచు తిన్నెల మీదుగా
ఇద్దరు మనుషులు ప్రయాణం మొదలెడతారు!
నీకు గుర్తుందా
ఈ తీరం వెంట మనం
గతంలో చివరిసారి ఎప్పుడు సంచరించామో?
అయ్యో, నాకు గుర్తులేదు
ఇది గడ్డకట్టిన డిసెంబర్ మాసపు కాలంకదా!
గాడిదల చెవులలా
చెట్లకు వేళ్ళాడుతున్న ఆకులు
జీవాన్ని కోల్పోయి ఉన్నకాలం
మనం గతంలో చివరిగా
ఇక్కడ విచ్చలవిడిగా సంచరిస్తూ
ఆనందోల్లాసాలను పంచుకున్న కాలం కదా!
ఇప్పుడు నీ భర్త
ఈ సొగసరి గుసగుసలను వింటాడేమో
ఈ ఆనందాశ్రువులను మోసే పాడెను చూస్తాడేమో
ఈ సంభాషణలోనే వాళ్ళు నడుస్తున్నారు
ఎత్తయిన పగోడాలను చూస్తూ
మబ్బులలోంచి జారిన తాళ్ళలా ఉన్న
మంచు దారాలను గమనిస్తూ
చెట్లకు వేళ్ళాడుతున్న
ఘంటాకృతి పూమొగ్గలను తడుముతూ
నర్మ సంగీతానికి పరాకాష్ట స్వరాన్ని పలుకుతూ
మహదానందంతో
ప్రేమ వస్ర్తాలలోకి ఒదుగుతూ.. ఎదుగుతూ...!!
మూలం: ఎడిత్ సిట్ వెల్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231


ఎడిత్ సిట్ వెల్

(1887, సెప్టెంబర్ 7-1964 డిసెంబర్ 9)Edith-Sitwell
ఇంగ్లండ్ దేశంలో యార్క్‌షైర్‌లోని స్కార్ బరో ప్రాంతంలో ఒక ప్రముఖ సాహితీ కుటుంబంలో జన్మించిన డేమ్ ఎడిత్ లూయిసా సిట్ వె ల్, వెన్నెముక సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉండి, కుర్చీకే అతుక్కుపోయి ఉండేది. యవ్వన ప్రాయం నాటికి ఆమె ఆ సమ స్యను అధిగమించి ఫ్రాన్స్‌కు వెళ్లింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధకాలంలోని సంఘటనల స్ఫూర్తితో తన కవిత్వాన్ని రాసింది. ఆ సమయంలో ఆమె రాసిన Street Songs (1942), Song of the Cold (1945) వంటి కావ్యాలు ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తిం పును తెచ్చాయి. యుద్ధం వల్ల లండన్ నగరమంతా కరెంట్ లేక అంధకారమయమైనప్పటికీ, నూనె దీపాల వెలుగులోనే ఆమె ఈ కవిత్వాన్ని సృజించింది. తన శారీరక సమస్యలను సైతం లెక్కచేయ క, యుద్ధ సైనికుల కోసం స్వెటర్‌లను అల్లి పంపించింది.

ఆ తర్వాత ఆమె అమెరికాలో పర్యటించి కవితా పఠనాన్ని ఒక ఉద్యమంగా మలుచడంలో తీవ్ర కృషి చేసింది. చివర్లో ఆమె వీల్ చైర్‌కే పరిమితమైనప్పటికీ, కావ్య గానాన్ని మానలేదు. ఇలా జీవిత పర్యంతం అవివాహితగానే బ్రతికిన సిట్ వెల్ 1918లో Clowns Houses మొదలెట్టి Facade (1922), The Sleeping Beauty (1924), Rustic Elegies (1927), Gardeners and Astro -nomers (1953),The Outcasts (1962) వంటి కవితా సం కలనాలతో అమరత్వాన్ని సాధించింది.

501
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles