అప్రకటిత


Sun,December 2, 2018 11:13 PM

mahijabin
Next జన్మలో
ఆవుగా పుట్టాలా..
ఆడపిల్లగా పుట్టాలా..
ఆలోచిస్తూ నేను Time pass చేస్తుంటే
మీరేమో కవిత్వం రాయి,
కవిత్వం రాయి అంటారు..!
అప్రకటిత Emergency అలుముకున్న
సంక్షుభిత సమయంలో ఎవరైనా ఏం రాయగలరు?
Tolerance- Intolerance నడుమ
నలుగుతున్న వర్తమానం
మతం మీద, మేధస్సు మీద
ఆహారం మీద, ఆలోచన మీద
కొనసాగుతున్న అజమాయిషీ
bloody food Politics..
ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలిన
రాజకీయ సందర్భం..!
Universityలు ధ్వంసమౌతున్న చరిత్రహీన కాలం
అసహనం వెల్లువై పదాలకు అర్థం మార్చేసిన వైనం
ఇప్పుడు దేశభక్తికి కొలమానం Surgical Strick..
Secularism అంటే Uniform Civil Code..!
సరిహద్దుల్లో యుద్ధాన్ని ప్రేమించకపోతే
దేశం మీద ప్రేమ లేనట్టు
నా మాతృభూమి చుట్టూ ఒకే ఒక పదం
ఇప్పుడు మంత్రమై తిరుగుతుంది
భారత మాతాకి జై అంటూ
అదే సర్వస్వమైనప్పుడు
అదే Development, అదే Economic Stebility
అదే Food Securityగా అర్థం చేసుకోవాలి.
Dissent Voice దేశ ద్రోహమవుతున్నప్పుడు
నేను మాత్రం ఏం రాయగలను.. ...?
- మహెజబీన్, 98665 87919

436
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles