ఎలక్షన్


Sun,December 2, 2018 11:12 PM

ఆకలన్నఅరగంటలోపే.. బిర్యానీ ముందుంటున్నది!
దాహమనరవకముందే.. థమ్సప్ బాటిల్ చేతిలో ఉంటున్నది!
అవసరాలు వాల్లకెలా తెలుస్తున్నాయో గానీ.. అడగకముందే అన్నీ తీర్చేస్తున్నారు..!
చేతిలో జండా ఉంటే చాలు.. స్వర్గంలోకాల్మోపినా ఇట్లుండదేమో!
బయటికెల్లాలంటే చాలు ఇన్నోవాతో ఇగిలించుకుంటూ ఇంటిముందుంటుండ్రు
ప్రజాస్వామ్యం పరిఢవిల్లు తున్నట్లుంది
ప్రజలంతా సుఖంగున్నట్లుంది
కలగనడంలేదని ఖచ్చితంగా చెప్పగలను
మా బామ్మ చిన్నప్పుడు దాశిపెట్టి దాశిపెట్టి తినబెట్టినట్లు
సాటుంగ సాటుంగ పైసలిచ్చి బోతుండ్రు..!
యాడగన్పడ్డా యెంతబాగ నవ్వుతుండ్రో
అరే ఒరే అన్న మాటలే వినబడటంలేదు
మానవత్వం పరిమళిస్తున్నది, మంచిమనుషులే గనిపిస్తుండ్రు
అందరు నన్ను అన్నా అంటుంటే.. నా మర్యాద పెరిగినట్లున్నది..!
నా దేశం యెలిగి బోతుందనుకుంటుంటే
ఈ సంబరాలు యిరవై రోజులే అంటుండ్రు..
ఎలక్షన్ కమీషన్ ఎందుకిలా జేస్తుంది?
నామినేషన్ కూ ఎలక్షన్ కూ నడుమ యాడాదుంటే యెంతబాగుండు.. ..!!
- వీరా గుడిపల్లి, 97016 18916

261
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles