అతను @ 40


Sun,November 25, 2018 10:48 PM

chandrababu
ఊరేగుతున్న జెండాలన్నీ
విజయకేతనాలు ఎగుర వేయలేవు
కొన్ని అవకాశపు పడగ నీడలు!
హద్దులు గీసుకున్నాక కూడా
అమవాసచంద్రుడు అక్రమ ప్రవేశానికి
దారులు వెతుకుతాడు!
సమీకరణలు మారినప్పుడు/ అతనికి ఇటలీ దయ్యం కూడా
దేవతావతారమెత్తుతుంది!
ఇంట్లో పప్పులుడకనప్పుడల్లా
ఢిల్లీ వీధుల్లో పండగ చేసుకోవడం
అతనికి నలభై ఏళ్ళ అనుభవమే!
గెల్వడం వీలు కానప్పుడు/ ఓడించే యత్నం చేయడం
ఆ వెన్నుపోటుదారునికి అలవాటే!
అతను రాజకీయాలను/ కలగాపులగం చేస్తున్నాడంటే
నమ్మిన వాళ్ళని నట్టేట్లో ముంచుతున్నట్లే!
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి, 94402 33261

493
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles