చీకటీ వెల్తురూ


Sun,November 25, 2018 10:48 PM

వేదిక మీద
వెల్తురు నాటకం ముగిసింది/ చీకటి పరదా దిగిపోయింది
వేదికంతా మసక మసక
ఒక్కసారిగా/ తెల్వని వెలితి ఏదో ముప్పిరిగొంది
గుండె లోతుల్లోంచి
ఎగిసిన ఉప్పెన
మునకలు వేయిస్తున్నది
కంటికోనుకుల్లో
గడ్డకట్టిన తడి
డస్టర్‌లా అబద్ధాల్ని
తుడిచేస్తున్నది
కడుపులో మెలిదిరిగిన/ వాస్తవం ముడి విప్పుకుంటున్నది
ముఖానికి తగిలించుకున్న/ ఆచ్ఛాదన
పొలుసులు పొలుసులుగా/ రాలిపోతున్నది
నగిషీలు చెక్కిన
నటననెక్కడో ఒలికిపోయింది
రంగుల్లేని నలుపు తెలుపు ముఖమేదో
ఎదుట అద్దంలో నిలబడింది
చీకటి పరదా చాటున
నా లోపలి వేల్తురేదో మెరిసి మిరుమిట్లు గొలిపే
కాంతి శిఖరమై నాకే కనిపిస్తున్నది
అవును మరి
వెల్తురు లో బయటి లోకాన్ని చూస్తాను
ఛత్రమై కమ్మేసిన
చీకటి నీడన/ లోపలి ప్రపంచాన్ని దర్శిస్తాను
- వారాల ఆనంద్, 94405 01281

354
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles