రెక్కల జాడలు


Sun,November 18, 2018 10:55 PM

bird
పక్షులు అలా ఎగిరి
వెళ్ళి పోయాయనుకోవద్దు..
ఆకాశంలో వాటి రెక్కల జాడలుంటాయి
నింగిలో దిక్కూ దారి
లేదను కోవద్దు
భూమే దాని దశనూ
దిశనూ నిర్ణయిస్తుంది
మట్టి ఉండటం వల్లే
శూన్యానికి అంత విలువ
చీమలు పాకుతూ వెళ్తుంటే
కండ్లింత చేసుకుని చూస్తుంది
విస్తీర్ణం ఎంత ప్రవేశించినా
మనసులో
ఇంక కొంత జాగా మిగిలే వుంటుంది!
గాలి తరుముకొస్తుంటే
పురుగేత్తే మేఘాలు
నేల మీదికి దిగిరాక తప్పదు
కన్నీళ్ళ ముందు వర్షమెంత!
ఆలోచనల ముంగిట
క్షణక్షణ విస్ఫారిత విలోకనాలెంత!
అంతర్లోకంలో
నింగినేలా ఒక్కటైన
అపురూప దృశ్యం
సృష్టి పట్ల
కొత్త దృష్టిని ప్రసాదిస్తుంది...
- డాక్టర్ ఎన్.గోపి

449
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles