ఈ మట్టి వెన్నెలసొన


Sun,November 18, 2018 10:54 PM

ODDIRAJAU
మాట కొంచం మందమే కావచ్చు
చూపు విప్పుకున్న తెలంగాణ పువ్వు పరిమళమే
గమ్యం దిక్కు అడుగులు మెల్లగనే పడొచ్చు
చెరువులో నీళ్ల ఊటలు నిజమే చెబుతై
ఆరు దశాబ్దాల కలల చిగురు మీద
కాలువలు విస్తరిస్తున్న వెలుతురు ప్రవాహం
ఆసరా.. వణుకుతున్న చేతులకు నమ్మకం
కాపలా పండువారిన దేహానికి
మట్టి వానను పసిగట్టినట్టే
మనిషి ఆత్మను పట్టుకుంటది బంధం
పాలపిట్టను నిమిరినోళ్ల చేతుల్ని
ప్రకృతి ముద్దాడుతది
జరుగుతున్న పనుల చిక్కుముళ్లు
కొస ఎళ్ళితేనే విప్పుకుంటై
ఓపిక పట్టుడు ఈ నేల లక్షణమని
ఆనకట్ట జల జల రాగం తీస్తూ చెబుతున్నది
కళ్యాణ వైభోగం ఉద్యమ ఫలమే
ఆగకుండ పోస్తున్న బోరుబావి వాస్తవమే
ఈ అందమైన సౌధానికి
నిట్టడు మనమే
చందమామ
వెన్నెల సొన ఈ భూమిమీద నుంచి
మెదిగే అన్నం మూత మీద వాలేను
వెలిగే దీపానికి రెండు చేతుల భద్రత కంటే
నాలుగు గోడలున్న ఇల్లే భద్రం
- వేముగంటి మురళి, 8309178109

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles