ఎన్నుకునే కళ


Sun,November 4, 2018 10:56 PM

voting
ఎన్నికలలో ఎన్ని కళలో..
ఎన్ని వలలో..
వాగ్దానా కళ
పీఠం కొరకు జరిగే పోటీలో
కల్లలాడే కళ.
కల నెరవేర్చుకునుటకు
కప్పదాట్ల కళ
మధ్యల పచ్చిగడ్డి వేస్తే
మంటలు మండినా...
ఆ మంటలకు కాపుకునే
కళ.
ఓటరూ! నీవే బెటరు అని
బేంచి ఎక్కిచ్చే కళ.
కవి అక్షరాలను పేపరుపై
పెట్టలేని కళ...
చిత్రకారుని కుంచెకు
దొరకని కళ..
నృత్యకారుని కాళ్ల
అందెలు మోగని కళ...
రాజకీయ నాయకులకున్న
అధికార కాంక్ష కళ.
కల్లలేవో కళలేవో
తెలుసుకునే కళ...
ఓటరు నీ చేతిలో ఉన్న
ఓటు కళ.
ఏక్ దిన్‌కా సుల్తాన్‌గా
నీకున్న కళ.
పాంచ్‌సాల్ సుల్తాన్‌ను
ఎన్నుకునే కళ.
- ఎన్నవెళ్లి రాజమౌళి, 98485 92331

606
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles