క్లారిబెల్ ఆలెగ్రియా


Mon,October 29, 2018 12:27 AM

(1924, మే 12-2018, జనవరి 25)
CLARIBEL-alegria
తండ్రిది నికారాగువా! తల్లిది సాల్వడార్! దేశాల హద్దులను చెరిపేసిన ప్రేమకు పుట్టిన బాల మేధావి.. క్లారా ఇజాబెల్ ఆలెగ్రియా విడెస్! నికారాగువాపై అమెరికా ఆక్రమణ కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తూ ప్రవాస పోరాటం చేసిన విప్లవవాది బిడ్డగా ఆమెకు బాల్యంలోనే తగిన ప్రాపంచిక జ్ణానం అలవడిం . తన ఆరవ ఏట నుంచే కవిత్వాన్ని తల్లికి చెబుతూ రాయించిన ఆమె, ఆ తర్వాత ప్రఖ్యాత ఆస్ట్రియన్ కవి రెయినర్ మేరియా రిల్కే (1875-1926) సాహిత్యం చేత తీవ్రంగా ప్రభావితమైంది. 1950-60 కాలంలో వచ్చిన నిబద్ధ తరం సాహిత్యోద్యమం (Com -mitted Generation Movement)లో కీలక పాత్ర పోషించి, స్వేచ్ఛకు, మానవ హక్కులకు అక్షర పతాకమై నిలిచింది. మధ్య అమెరికా ప్రాంతం నుంచి అంతర్జాతీయ కవిత్వాన్ని సృష్టించిన సృజనకారిణిగా పేరొందిన ఆమె, అమెరికన్ నోబెల్ ప్రైజ్‌గా ప్రఖ్యాతిగాంచిన News tadt International Prize for Literatureను 2006లో గెలుచుకున్నది. Ring of Silence (1948), Flowers from the Volcano (19 82), Sorrow (1999) వంటి కావ్యాలు, ఆమెలోని స్వేచ్ఛా కాంక్షకు, పీడిత ప్రజల గోసతో మమే కం చెందిన తీరుకు నిలువుటద్దాలు.
శవజ్జీవం!
నేను తెలుసుకున్నాను
ఈ ప్రభాత సమయాన
నిద్రలోంచి మేల్కొన్న క్షణాన..
నువ్వు తీవ్ర గాయాల పాలై
చావు తప్పి కొన ఊపిరితో ఉన్నావని..
నేను కూడా..
మన దినాలు దగ్గర పడ్డాయని
మనకు తెలీకుండానే
మన రాత్రుల్ని మరెవరో కాజేసారని ...
అందుకే
మున్నెన్నడూ లేనంతగా ఇపుడు
నేను నిన్ను ప్రేమించాలి
నువ్వు కూడా నన్ను ప్రేమించాలి
అందుకే ఇపుడు అపురూపంగా
నీ దేహ వాసనని నేను ఆఘ్రాణించాను
నువ్వు నిశ్ చింతగా నిద్రిస్తుంటే
నేను తదేకంగా చూస్తూ గడిపాను
నీ సున్నిత చర్మంపై
నా వేలి కొసలను ఇష్టంగా పరుగెత్తించాను
అలా చేస్తూనే-
మరో దిక్కు పయనించిన
నా మిత్రులను గుర్తు చేసుకున్నాను
సహజ మరణం పొందిన ఒకణ్ణి,
తిరుగుబాటు పోరాటం చేసిన మరొకణ్ణి,
జైలులో తీవ్ర హింసలకు గురై
మృత్యువును ముద్దాడిన ఇంకొకణ్ణి!
స్మృతుల మధ్యనే
నా పెదాల కుంచెలతో
నీ వెచ్చని దేహాన్ని దిద్దాను
ప్రియా, నువ్వు
జీవచ్ఛవం అయ్యేంతగా
గాయపడ్డావు కదా
శవజ్జీవంగా కదలాడుతున్నావు కదా
బహుశా, ఇప్పుడైనా నేను
నిన్ను గతంలో కన్నా
మిన్నగా ప్రేమిస్తానేమో
నువ్వు కూడా...
అంతే కదా..!
మూలం: క్లారిబెల్ ఆలెగ్రియా
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles