స్పష్టత- అస్పష్టత!


Sun,October 21, 2018 10:50 PM

way
పరిచిన దారుల్లో
తెలిపిన తోవల్లో
మీ గమనాలు
బహు వేగం!

ముందుకు సాగే
మార్గమే లేక
మా గమనాలు
అతి భారం!

స్పష్టమైన దారుల్లో
కోరుకున్న గమ్యంవైపు
క్షణం ఆలోచించక
దూసుకెల్తారు మీరు!
అస్పష్టమైన మార్గాన
గుంతలు పూడుస్తూ
ఊబిలు తప్పుకుంటూ
జాగ్రత్తగా నడుస్తాం మేము!

ఆలోచనలకు అవకాశం లేక
మీ మెదళ్ళు మొద్దుబారుతాయ్
ఎప్పుడూ అప్రమత్తమై
మా మెదళ్ళు రాటుదేలుతాయ్!

గుడ్డిగా నమ్మిన మార్గం
గతి తప్పుతుందనిపిస్తే
తత్తరపడ్తారు అనుమానిస్తారు
వేగం తగ్గుతుంది మీకు!
మేమేర్పరుచుకున్న మార్గం
నడిచి తిరిగిన మార్గం
ఆత్మైస్థెర్యంతో నడుస్తాం
వేగం పెరుగుతుంది మాకు!

అస్పష్టతతో అనుమానంతో
మార్గ యానంజేస్తూ మీరు!
స్పష్టతతో ధైర్యంగా సూటిగా
గమ్యానికి పయనిస్తూ మేము!
-రవి కిషోర్ పెంట్రాల

564
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles